Share News

kumaram bheem asifabad- ఏళ్లుగా ఎదురుచూపులు

ABN , Publish Date - May 24 , 2026 | 10:27 PM

నిధులు లేమి, పనులు పూర్తిపై శ్రద్ధ చూపక పోవడం తో జిల్లాలోని ప్రాజెక్టులు ఏళ్లుగా పూర్తి కాకవడం లేదు. జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుప యోగంగా మారుతుంది.

kumaram bheem asifabad- ఏళ్లుగా ఎదురుచూపులు
జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు

- పంటలకు నీరు చేరక రైతుల అవస్థలు

- రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతల వినతి

ఆసిఫాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): నిధులు లేమి, పనులు పూర్తిపై శ్రద్ధ చూపక పోవడం తో జిల్లాలోని ప్రాజెక్టులు ఏళ్లుగా పూర్తి కాకవడం లేదు. జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుప యోగంగా మారుతుంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తుంది. చివరి వానస్తే పంట లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. అన్నదా తలు పూర్తిగా వర్షాదార పంటలపై ఆధార పడు తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తై సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మా ణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మర మ్మతులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపో వడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.

- పూర్తి కాని కుమరం భీం..

జిల్లాలో సాగునీటికి గుండెకాయ వంటి కుమరం భీం ప్రాజెక్టు కూడా ఏళ్లుగా రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యం తో సుమారు రూ.600 కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరు వేల ఎక రాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45,500 ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజె క్టును రూపొందించారు. ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాలేదు.

- దయనీయ స్థితిలో..

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2700 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశిం చారు. కాలువలు ప్రాజె క్టు నిర్మాణం నుంచి ఆధునీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వా నంగా మారాయి. చాలా చోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించే స్థితిలో లేదు. అధికారులు ఆధునీకరణ పనుల కోసం ప్రతి పాదనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు.

- జగన్నాథ్‌‘పూర్‌’..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధి 15,000 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ నత్తనడ కన కొనసాగుతున్నాయి. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టుదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూములు పంట పొలాలుగా మారుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవు తోంది. త్వరలో జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి పొలాలకు నీరు అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2026 | 10:27 PM