kumaram bheem asifabad- యాసంగి సాగు జోరు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:14 PM
జిల్లాలో యాసంగి సాగు జోరుగా సాగుతోంది. వానాకాలం ధాన్యం విక్రయాలను పూర్తి చేసుకున్న రైతాంగం ఇప్పుడిప్పుడే యాసంగి సీజన్‌కు సిద్ధమవుతోంది. దుక్కులు దున్నుతూ నాట్లు వేయడం మొదలు పెట్టారు. దీంతో జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో 38,212 ఎకారాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
- దుక్కులు దున్ని నాట్లు వేస్తున్న అన్నదాతలు
- జిల్లాలో 38,212 ఎకరాల్లో సాగుకు అంచనా
ఆసిఫాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సాగు జోరుగా సాగుతోంది. వానాకాలం ధాన్యం విక్రయాలను పూర్తి చేసుకున్న రైతాంగం ఇప్పుడిప్పుడే యాసంగి సీజన్‌కు సిద్ధమవుతోంది. దుక్కులు దున్నుతూ నాట్లు వేయడం మొదలు పెట్టారు. దీంతో జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో 38,212 ఎకారాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఆయా పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. జిల్లాలో యాసంగి సాగుకు ప్రణాళికలను వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు. వానాకాలం సీజన్‌లో విస్త్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, ప్రాజెక్టులు, బోరుబావులు నీటితో కళకళలాడుతు న్నాయి. భూగర్భ జలాలు సరిపడా అందుబాటులో ఉన్నా యి. దీంతో యాసంగి సాగుకు అన్ని రకాల పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వివిధ పంటల సాగు అంచనా ఎరువులు అవసరాలపై కార్యచరణను వ్యవసాయశాఖ సిద్ధ చేసింది.
- జిల్లా వ్యాప్తంగా..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 38,212 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందు లో ప్రధానంగా వరి పంటను సాగు చేయను న్నారు. జిల్లాలో వరి పంట 17,844 ఎకరాలు, పెసర 652 ఎకరాలు, జొన్న 12,075, మొక్కజొన్న 3941 ఎకరాలు, గోధుమలు 659 ఎకరాలు, శెనగ 2785 ఎకరాలు ఇతర పంటలు 256 ఎకరాలలో సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు. జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన ఎరువుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులను రైతులు కొనుగోలు చేస్తున్నారు.జిల్లాలో యాసంగి సాగుకు యూరియా 88,120 బస్తాలు, డీఏపీ 38,200 బస్తాలు, అవసరముంటుందని అంచనా వేశారు.
- అత్యధిక వర్షపాతం..
జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 15 మండ లాలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో నీటి నిలువలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో సరాసరి భూగర్బ నీటి మట్టం 9.15 మీటర్లకు చేరుకుంది. నీటి నిలువలు అందుబాటులో ఉండటంతో యాసంగి సీజన్‌లో వరి సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. వరితో పాటు జొన్న, శనగ ఇతర అంతర పంటలను సాగు చేయనున్నారు. ఈ యాసంగి సీజన్‌లో పంటల సాగు చేయడంలో జిల్లా రైతులు నిమగ ్నమయ్యారు. గ్రామాల్లో దుక్కులు దున్నుతూ నాట్లు వేయడం మొదలు పెట్టారు. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడం, ట్రాక్టర్, డీజిల్, పెట్రోల్, కూలీలకు పెట్టుబడు కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించాల్సిన పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సహయం కింద రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున వానకాలం యాసంగి సీజన్‌లలో రైతుల ఖాతాల్లో జమ చేసేది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద రైతు భరోస పథకం ద్వారా ఎకరానికి రూ. 7500 చొప్పున రెండు విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిం ది. కానీ నిధుల కొరత కారణంగా గత యాసంగి నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.6,000 మాత్ర మే అందిస్తోంది. జిల్లాలో మొత్తం 1,43,000 మంది రైతులు ఉండగా సీజన్ ప్రారంభమైనా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నేటికి అందిచలేదు..అయితే ప్రభుత్వం తాజాగా సంక్రాతి కి రైతు భరోసా అందిస్తామని ప్రకటించడంతో రైతులు వేచి చూస్తున్నారు.