యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 11 , 2026 | 06:14 AM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.
యాదగిరిగుట్ట, మే 10(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించగా, ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టింది. మరోవైపు శివాలయంలో కొలువైన పర్వతవర్ధిని అమ్మవారికి ఆదివారం నుంచి నూతనంగా అర్జిత సేవను ప్రారంభించారు. ప్రతి అష్టమికి అమ్మవారికి ప్రత్యేకంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అభిషేకం, కుంకుమార్చన సేవ నిర్వహించనున్నట్లు ఈవో జే. భవానీశంకర్ తెలిపారు.