Share News

భక్తజన సంద్రం.. యాదగిరి క్షేత్రం

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:59 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. సుమారు 75వేల మంది గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

భక్తజన సంద్రం.. యాదగిరి క్షేత్రం

  • గిరిప్రదక్షిణలో పాల్గొన్న 75వేల మంది భక్తులు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. సుమారు 75వేల మంది గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వాతి వేడుకలు, వారాంతపు రద్దీ కలిసి భక్తులు పెద్ద సంఖ్యలో ఉభయ క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలు, మధ్యాహ్నం ఆరగింపు సమయం కలిపి 3గంటలపాటు వేచి ఉన్నారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.52,79,728 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన ఈవో భవానీశంకర్‌ తెలిపారు.

Updated Date - Feb 09 , 2026 | 01:59 AM