యాదగిరిగుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:12 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆదివారం సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు....
యాదగిరిగుట్ట/హైదరాబాద్ సిటీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆదివారం సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో హైదరాబాద్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక శ్రీవైష్ణోదేవి కూచిపూడి నృత్య భంగిమలను ప్రదర్శించి భక్తులను అలరించింది. మరోవైపు దివ్యక్షేత్రంలో ఉదయం 10 వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఆదివారం సుమారు 40వేల మంది భక్తులు తరలిరాగా, ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.45,46,811 ఆదాయం సమకూరింది.