Share News

కోలాహలంగా యాద‘గిరి’క్షేత్రం

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:53 AM

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 40వేల మంది లక్ష్మీనృసింహుడిని దర్శించుకోగా.....

కోలాహలంగా యాద‘గిరి’క్షేత్రం

  • లక్ష్మీనృసింహుడి దర్శనానికి 40వేల మంది భక్తులు

  • రేపు చంద్రగ్రహణం.. ఉదయాన్నే ఆలయం మూసివేత

యాదగిరిగుట్ట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 40వేల మంది లక్ష్మీనృసింహుడిని దర్శించుకోగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టింది. కాగా, సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉన్నందున ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయం మూసివేస్తారు. ఈ నెల 4వ తేదీన వేకువజామున 3 గంటలకు ఆలయాలను తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు.

Updated Date - Mar 02 , 2026 | 01:53 AM