Yadadri Bhongir: బాలికపై లైంగిక దాడి నిందితుడి ఇంటికి నిప్పు
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:42 AM
యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నారి(5)పై లైంగికదాడికి పాల్పడిన మాజీ సర్పంచ్ ఇంటికి మంగళవారం రాత్రి గ్రామస్థులు నిప్పు పెట్టారు.
పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థుల ఆందోళన
భువనగిరి రూరల్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నారి(5)పై లైంగికదాడికి పాల్పడిన మాజీ సర్పంచ్ ఇంటికి మంగళవారం రాత్రి గ్రామస్థులు నిప్పు పెట్టారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో మంటలు అదుపు చేయించారు. అనంతరం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు తెలిపారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎల్లయ్యను పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు.