తప్పుడు బిల్లులు ఇస్తే వారంలో సరిచేయాలి
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:49 AM
విద్యుత్ పంపిణీ సంస్థలు జారీ చేసిన తప్పుడు బిల్లులను వినియోగదారుడు గుర్తించి, ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లోపు సరిచేయాలని తెలంగాణ ...
ఈఆర్సీ ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ పంపిణీ సంస్థలు జారీ చేసిన తప్పుడు బిల్లులను వినియోగదారుడు గుర్తించి, ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లోపు సరిచేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు బిల్లు కారణంగా వినియోగదారుడు ఆమేరకు ఇదివరకే చెల్లింపులు చేసి ఉంటే... వసూలు చేసిన మొత్తంపై 18 శాతం వార్షిక వడ్డీని లెక్కకట్టి... తదుపరి బిల్లుల్లో సర్దుబాటు చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్(ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్) మూడో సవరణ-2026 ప్రకారం నాలుగో నియమావళిని సోమవారం జారీ చేసింది. లోపాలతో జారీ చేసిన బిల్లును కట్టని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి వీల్లేదని గుర్తుచేసింది. వారంలో కొత్త బిల్లు జారీ చేసి, అందులో కొత్త చెల్లింపు తేదీని పేర్కొనాలని సూచించింది.