ధాన్యం కొనుగోలు జాప్యంపై రాస్తారోకో
ABN , Publish Date - May 04 , 2026 | 11:31 PM
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ధాన్యం బస్తాలతో సోమవారం మండల కేంద్రంలో రో డ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి తరుగు, అంక్షలు లేకుండా ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు.
రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
దండేపల్లి మే 4 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ధాన్యం బస్తాలతో సోమవారం మండల కేంద్రంలో రో డ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి తరుగు, అంక్షలు లేకుండా ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. ఈసందర్బంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్ వరిధాన్యం, మొక్కజొన్న సేకరణలో పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారం భించి రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయడంలో పలు షరతులతో కూడిన ఆంక్షలు విఽధిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మం చిర్యాల నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులు ధాన్యం బస్తాకు నాలుగు కిలోలు కటింగ్ చేస్తు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం బస్తాలు కాంట అయిన తర్వాత బస్తాలను త రలించడానికి బ్యాగుకు రూ రెండు రూపాయల చొప్పున రైతులు ఇవ్వాలని లారీ డ్రైవర్ అడుగుతున్నారని ఇది అన్యాయమన్నారు. కొనుగోలు నిర్వహకులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే తీసుకుంటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎలాంటి షరతు లేకుండా ఎకరానికి 40 క్వింటాలు కొనుగోలు చే యాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేం ద్రాల్లో తరుగు లేకుండా 40కిలోల బ్యాగు వేసి కొనుగో లు చేయాలన్నారు. వడ్లకు ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని కొనడం వలన క్వింటాలుకు 20 రూపాయలు తేడా ఉందని, కా నీ మొత్తం వడ్లను బి గ్రేడ్ కింద కొంటూ రైతులను మో సం చేస్తోందని వడ్లను ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. రాస్తారోకోతో రోడ్డు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు తా హసీనోద్థీన్, సురేష్ సిబ్బందిలో అక్కడి చేరుకుని తహసీ ల్దార్ రోహిత్‌దేశ్‌పాండేకు సమాచారం ఇవ్వడంతో ఆయ న అక్కడి చేరుకోని వారితో మాట్లాడారు. సమస్యను కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్య క్రమంలో మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ కెతిరెడ్డి శ్రీనివా స్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మా జీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్‌కుమార్, మాజీ పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ అక్కల రవిందర్, నాయకులు సంతోష్, భూ మన్న, తిరుపతి, అజయ్, అంజన్న, వెంకట రమణ, పాల్గొన్నారు.