Share News

kumaram bheem asifabad- వామ్మో.. జూన్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 10:47 PM

ఏడాదంతా సాఫీగా సాగిపోవాలంటే జూన్‌ నెల ఎంతో కీలకం. పిల్లల చదువులు, వ్యవ సాయానికి పంట పెట్టుబడులు, వ్యాధుల నుంచి రక్షణ.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఒకసారే మీదపడనున్నాయి. ఈ నెలలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

kumaram bheem asifabad- వామ్మో.. జూన్‌
లోగో

- ప్రారంభం కానున్న పాఠశాలలు

- పిల్లల స్కూల్‌ ఫీజులు, పుస్తకాల ఖర్చులు తడిసి మోపెడు

- సాగు కోసం రైతుల పెట్టుబడులు

ఏడాదంతా సాఫీగా సాగిపోవాలంటే జూన్‌ నెల ఎంతో కీలకం. పిల్లల చదువులు, వ్యవ సాయానికి పంట పెట్టుబడులు, వ్యాధుల నుంచి రక్షణ.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఒకసారే మీదపడనున్నాయి. ఈ నెలలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆసిఫాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జూన్‌ వ చ్చిందంటే చాలు సామాన్య, మధ్య తరగతి కుటుం బీకుల గుండె గుబేలుమంటుంది. పిల్లల స్కూల్‌ ఫీజులు తలుచుకుంటే ఫీజులు ఎగిరి పోయే పరిస్థి తి. అంతేనా.. యూనిఫారం, పుస్తకాలు, ఇతరా త్ర అవసరాల కొనుగోలు లెక్కలు వేసుకుంటేనే గుండె బరువైక్కించే ఆర్థిక భారం. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు వేలకు వేలు చెల్లించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే లక్షల్లోనే ఫీజులు ఉంటున్నాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుం టున్నామని చెబుతున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. జిల్లాలో 1,258 ప్రభుత్వ, సుమారు 250 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల యాజ మాన్యాలు పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీల్లో చేర్పించాలంటేనే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఒక్కటే కాదు. యూనిఫాం కొనుగోలుకు సైతం వేలల్లోనే ఖర్చు భరించాల్సి వస్తోంది. ఇక కొన్ని పాఠశాలలు పుస్తకాలను కూడా విక్రయిస్తున్నాయి. మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా వాత పెడుతున్నాయి. అనివార్యంగా తల్లిదం డ్రులు అధిక ధరలను భరించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితే. ఇక రవాణా సౌకర్యం కోసం స్కూల్‌ బస్సుల ఫీజు మోత. ఇవన్నీ తప్పని సరిగా చేయా ల్సిందే. పిల్లల ఫీజుల కోసం రెండు చేతుల సంపాదన ఉన్న కుటుంబాలు సైతం చేబదుళ్లు. వడ్డీకి రుణాలు తీసుకునే పరిస్థితే ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూల్‌ ఫీజుల విషయంలో నర్సరీలోనే రూ.20 నుంచి రూ. 30 వేలు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొంచెం పేరెన్నిక పాఠశాలలో అయితే ఫీజులు సగటు జీవికి పెను భారంగానే మారాయి. ఇద్దరు పిల్లలకు ఫీజులు చెల్లించాల్సి వస్తే లక్ష రూపాయలకు పైగానే జూన్‌లో సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. నెలకొంది.

- సాగు వ్యయం..

వ్యవసాయంలో ఏటా పెట్టుబడి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కూలీల ఖర్చు 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. విత్తనాలు, పురుగుల మం దులు, ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. జిల్లాలో సుమారు 4.45లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశ మున్నదని వ్యవసాయ శాఖా ధికారులు అంచనా వేశారు. పత్తి, కంది, వరి, మొక్క జొన్న, కూరగాయలు రైతులు ఎక్కువగా సాగు చేయనున్నారు. తొలకరి చినుకులు పలకరిస్తే రైతులు సేద్యానికి సిద్దంగా ఉన్నారు. అన్నదాతలకు సాగులో ఖర్చులు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతంగా తయారు చేసుకోవడం, యాంత్రీకరణతో కూలీల ఖర్చు తగ్గించుకోవడం, వ్యవసా యంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకో వడం ద్వారా ఖర్చు తగ్గించుకుని లాభాలను పెంచుకు నేలా ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..

వాతావరణ మార్పులతో వ్యాధులు పంజా విసి రేందుకు సిద్ధంగా ఉంటాయి. వర్షాలు కురుస్తుం డడంతో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. జ్వరం, గొంతు నొప్పి. జలుబు, దగ్గు సమస్య లు తలెత్తుతాయి. దీంతో ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి. జిల్లాలో 20 పీహెచ్‌ సీలు ఉన్నాయి. మరో ఐదు సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో తదితర ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. జ్వరం వచ్చి ఆసుపత్రి పాలైతే 10 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంట్లో ఉండి చికిత్స చేయిం చుకున్నా ఔషధాలు, రక్తపరీక్షల రూపంలో సుమరు ఐదు వేల రూపాయలు కావల్సిందే. వారం రోజులు కూలికి వెళ్లక పోతే సుమారు ఆరు వేల రూపాయల వ రకు ఆదాయం పోగొట్టుకోవల్సిందే. వ్యాధుల బారిన పడితే అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. సీజనల్‌ వ్యాఽ దుల బారిన పడకుండా వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకో వాలని చెబుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా చెత్తాచెదారం తొలగించాలని సూచిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 10:47 PM