పైసా వసూల్...!
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:54 PM
ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇప్పించే నెపంతో వ సూళ్ల దందాకు పాల్పడుతున్న సంఘటన మంచిర్యా ల జిల్లా కేంద్రంలో ఇటీవల వెలుగు చూసింది.
-కాంట్రాక్ట్ ఇప్పించే నెపంతో డబ్బులు డిమాండ్
-ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీ నుంచి భారీగా ముడుపులు
-మంత్రి పేరుతో జిల్లా కేంద్రంలో వసూళ్ల దందా
-సార్ అడిగారంటూ వాట్సాప్ చాటింగ్
మంచిర్యాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇప్పించే నెపంతో వ సూళ్ల దందాకు పాల్పడుతున్న సంఘటన మంచిర్యా ల జిల్లా కేంద్రంలో ఇటీవల వెలుగు చూసింది. ప్రభు త్వపరంగా వివిధ శాఖల్లో పనులు చేపట్టేందుకుగా ను అవసరమైన మ్యాన్ పవర్ సమకూర్చేందుకు లైసె న్స్లు కలిగిన ఏజెన్సీలకు ఉన్నతాధికారులు బాధ్యత లు అప్పగిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా లు, కంపెనీలు, పరిశ్రమలు, ఆస్పత్రులు, నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన సిబ్బందిని ఆయా ఏజెన్సీల ద్వారా సంస్థ అవసరాలకు అనుగుణంగా ఔట్ సోర్సిం గ్ విధానంలో ఎంపిక చేసి, నిర్ణయించిన పనులు చే పట్టవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా సెక్యూరి టీ గార్డులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, డ్రైవర్లు, ఆఫీస్ బాయ్స్, టెక్నీషియన్లు ఉంటారు. వీరంతా లైసెన్స్ కలి గిన మానవ వనరుల సరఫరా సంస్థ (మ్యాన్ పవర్ ఏజెన్సీ) ద్వారా నియమితులవుతారు. అలా నియమి తులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏజెన్సీలు కార్మిక శాఖ చట్టాలు, కాంట్రాక్ట్ లేబర్ నిబంధనల మేరకు వేతనా లు చెల్లించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయా లు కల్పించాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్ ఇప్పించే నెపంతో వసూళ్లు....
వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు ఇటీవల పలు నోటిఫికేషన్లు విడుదల య్యాయి. ఆయా పనులు చేపట్టేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చేందుకు లైసెన్స్డ్ ఏజె న్సీల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానించారు. అయి తే కాంట్రాక్ట్ సొంతం చేసుకోవాలంటే కలెక్టర్ల అనుమ తులు తప్పనిసరి. కలెక్టర్లు నిర్ణయించిన మేరకే ఆయా ఏజెన్సీలకు కాంట్రాక్ట్ దక్కుతుంది. దీంతో ప్రజా ప్రతి నిధుల మద్దతు కూడగడితే కాంట్రాక్ట్ దక్కించుకోవ చ్చునన్న ఉద్దేశ్యంతో ఏజెన్సీల నిర్వాహకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఆశ్రయించడం ఆ నవాయితీగా వస్తోంది. ఆయా ప్రజా ప్రతినిధులతో చె ప్పిస్తే కాంట్రాక్ట్ తథ్యమని భావిస్తున్న నిర్వాహకులు ఏదోలా ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్ని స్తుంటారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమదైన శైలిలో ప్రయ త్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికార పా ర్టీకి చెందిన ఓ నాయకుడిని ఆశ్రయించి, కాంట్రాక్ట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏజెన్సీ నిర్వాహకుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న సదరు నాయకుడు వారి నుంచి భారీ మొత్తంలో ముడుపు లు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సార్ అడుగుతున్నారని....!
మెదక్ జిల్లాలో ప్రభుత్వపరంగా చేపట్టే పలు ప నులకు గాను అక్కడి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను సొంతం చేసేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మ్యాన్ పవర్ ఏజెన్సీ మె దక్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మికశాఖ మాత్యు లు గడ్డం వివేకానంద పైరవీ కోసం ప్రయత్నాలు ము మ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెం దిన ఓ నేతను సంప్రదించారు. దీన్ని నగదుగా మలు చుకోవాలన్న ఆలోచనతో ఉన్న సదరు నాయకుడు ఏ జెన్సీ నిర్వాహకుల నుంచి అందినకాడికి దండుకున్న ట్లు జోరుగా ప్రచారం జరగుతోంది. ఏకంగా మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడటంతో తీవ్ర చర్చనీ యాంశం అవుతోంది. ఈ క్రమంలో గత నెలలో జరిగి న మంత్రి వివేక్ తండ్రి, కాకా వెంకటస్వామి జయం తిని పురస్కరించుకొని పెద్ద మొత్తంలో వసూలు చే సినట్లు సమాచారం. కాకా జయంతి సందర్భంగా మం చిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో పెద్ద సం ఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మంత్రి తన కు చెప్పారని, అందుకు ప్రస్తుతానికి రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని, ఆ సొమ్ము అందజేస్తే కాంట్రాక్ట్ సంగతి తానే చూసుకుంటానని నమ్మబలికినట్లు సమాచారం. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు రూ. 2 లక్షలను సదరు నే తకు ముట్టజెప్పగా, మిగతా డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే పని పూర్తికాగా నే మిగతా సొమ్ము చెల్లిస్తామని చెప్పినప్పటికీ ససేమిరా అనడంతో బాధితులు ఏకంగా మంత్రి వి వేక్ను కలిసి అసలు విషయం ఆయన దృష్టికి తీసు కెళ్లినట్లు సమాచారం. తమ పేరు చెప్పి డబ్బులు వ సూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి వి వేక్ సదరు నేతపట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు నేత ఏజెన్సీతో కాళ్లబేరానికి వెళ్లినట్లు తె లిసింది. జిల్లాలో ఇలాంటి సంఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. ఏజెన్సీల అవసరాన్ని ఆసరాగా తీ సుకుని డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతాలు అనేకం తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మంత్రి పేరు చె ప్పి అక్రమ వసూళ్లకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చ ర్చనీయాంశం అవుతోంది.