Share News

kumaram bheem asifabad- చివరి మజిలీకి చింతే

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:40 PM

చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు సవ్యంగా నిర్వహించి సాగనంపేందుకు గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నికావు. ప్రజలు అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు పడకుండా ఉండాలని కొన్నాళ్ల క్రితం వైకుంఠధామాలు నిర్మించింది. కానీ వాటిలో సౌకర్యాలు కల్పించక పోవడంతో నిరుపయోగంగా మారాయి. అంత్యక్రియలు చేసేందుకు సరిపడా స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

kumaram bheem asifabad- చివరి మజిలీకి చింతే
లోగో

- పేరుకే ఊరికో వైకుంఠధామం

- అనువుగానిచోట నిర్మాణాలు

- నీటి వసతి, సౌకర్యాలు కరువు

- రూ.లక్షల్లో ప్రజాధనం వృథా

- అధికారులు దృష్టి పెడితేనే ప్రయోజనం

బెజ్జూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు సవ్యంగా నిర్వహించి సాగనంపేందుకు గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నికావు. ప్రజలు అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు పడకుండా ఉండాలని కొన్నాళ్ల క్రితం వైకుంఠధామాలు నిర్మించింది. కానీ వాటిలో సౌకర్యాలు కల్పించక పోవడంతో నిరుపయోగంగా మారాయి. అంత్యక్రియలు చేసేందుకు సరిపడా స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మౌలిక వసతులు కానరావడం లేదు. అంత్యక్రియల అనంతరం స్నానాలు చేసేందుకు నీరు కరువైంది. రూ.కోట్లు ఖర్చు చేసి శ్మశాన వాటికలు నిర్మించినా నిర్వహ ణను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు పనికిరావడం లేదన్న విమర్శలున్నాయి. వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో కష్టాలు ఇక షరా మామూలుగా మారింది. తమవారు చనిపోయిన బాదలో ఉన్నవాళ్లకు మరింత బాదను కలిగించేలా వైకుంఠధామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పల్లెల్లో నిర్మించిన వైకుంఠధామాల పరిస్థితి ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకం కింద 2018-19లో ఒక్కోదానికి నిర్మాణం కోసం రూ.12లక్షలు మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల అంత్యక్రియలకు ఉపయుక్తంగా ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తే చాలా వరకు వినియోగంలోకి వస్తాయి. కానీ అధికారులు మాత్రం వీటిపై దృష్టి సారించని కారణంగా ప్రజలకు చివరి మజిలీకీ కష్టాలు తప్పడం లేదు.

- పల్లెప్రగతిలో భాగంగా..

పల్లెప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ వైకుంఠధామం నిర్మించారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు దాతల నుంచి సేకరించిన భూములను ఇందుకోసం కేటాయించారు. సొంతభూములు లేనివారికి ఇవి ఉపయోగపడతాయని బావించారు. దహనం చేసే గద్దెలతో పాటు స్నానాల గదులు, హాల్‌ నిర్మించారు. నీటి సౌకర్యం కోసం బోర్లు కూడా వేశారు. అయితే విద్యుత్‌ సౌకర్యం లేక బోర్లు పనిచేయడం లేదు. వైకుంఠధామాల వద్ద లైట్లు వెలగకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. వైకుంఠధామాలకు వెళ్లడానికి దారులు లేక అంత్యక్రియలకు అటువైపు చూడడం లేదు. దీంతో గద్దెల చుట్టూ పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. గదులు ధ్వంసమవుతున్నాయి.

- రూ. లక్షలు వెచ్చించినా..

లక్షల రూపాయలు వెచ్చించిన వైకుంఠధామాలు వినియోగంలో లేకపోవడం, వాటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 15మండలాల పరిధిలో 335గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల పరిధిలో వైకుంఠధామాలను నిర్మించారు. అయితే వాటి నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వైకుంఠధామాల నిర్వహణ అస్తవ్యస్తవంగా మారడంతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే గ్రామాల సమీపంలో వాగులు, చెరువుల వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాలు అలంకారప్రాయంగా మారాయి. లక్షలు వెచ్చించినా వినియోగంలో లేకపోవడం, వాటి నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పల్లెల్లో సైతం ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో అన్ని భూముల్లోనూ వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో దహన సంస్కారాలకు చోటులేకుండా పోయింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మిస్తే ప్రజలకు మేలు కలుగుతుందన్న అభిప్రాయంతో ఏర్పాటు చేయగా తొలుత వాటి నిర్మాణాలను వేగిర పరిచి పూర్తి చేయించారు. కానీ అన్ని చోట్ల నీటి వసతి, విద్యుతు సౌకర్యం కల్పించ లేదు. దీంతో నిర్వహణ లేకుండా పోయింది. జిల్లాలోని వైకుంఠధామాల్లో పిచ్చిమొక్కలు నిండి పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో ప్రజలకు చితి తంటాలు తప్పడం లేదు. వీటి నిర్వహణపై ప్రస్తుత ప్రభుత్వమైనా దృష్ఠి సారించి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దహన సంస్కారాలకు ఇబ్బంది..

- ఆలం మనోహర్‌, మొగవెల్లి

గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాల్లో సౌకర్యాలు దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నాం. గ్రామాల్లో ఖాళీ స్థలాలు లేక వాగువెంట ప్రదేశాల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. అధికారులు స్పందించి శ్మశానవాటికల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.

Updated Date - Mar 29 , 2026 | 10:41 PM