Share News

kumaram bheem asifabad- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:59 PM

:ప్రపంచ ఆదిసీ దినోత్సవాన్ని ఈనెల 9న ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఎంఆర్‌సీ కార్యాలయంలో శనివారం సన్నహక సమావేశాన్ని నిర్వహించారు.

kumaram bheem asifabad- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలి
మాట్లాడుతున్న గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) :ప్రపంచ ఆదిసీ దినోత్సవాన్ని ఈనెల 9న ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఎంఆర్‌సీ కార్యాలయంలో శనివారం సన్నహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఐక్యతతో సంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించి ఆదివాసీ సమాజ ఐకమైత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిదులు అధికారులు యువత పాల్గొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్‌ సేవాసమితి జాతీయ అధ్యక్షుడు సిడాం అర్జు, ఆసిఫాబాద్‌ సర్‌మేడి జ్ఞానేశ్వర్‌, ప్రదాన్‌ పురోహిత్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, ఏసీఎంఓ ఉద్దవ్‌, జీసీడీఓ శకుంతల, జిల్లా క్రీడల అధికారి శేకు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 10:59 PM