Share News

kumaram bheem asifabad-ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ABN , Publish Date - Aug 09 , 2026 | 10:23 PM

కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక డాడానగర్‌ చౌరస్తాలో గల కుమరం భీం విగ్రహానికి సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీం ఆశయాల సాధన కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

kumaram bheem asifabad-ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కాగజ్‌నగర్‌లో కుమరం భీం విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక డాడానగర్‌ చౌరస్తాలో గల కుమరం భీం విగ్రహానికి సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీం ఆశయాల సాధన కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని దారిగాంలో సీపీఐ(ఎంఎ ల్‌) న్యూమోడెక్రసి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్‌ పాషా మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో కుమరం భీం చిత్రపటానికి, విగ్రహాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల కేంద్రంలోని కుమరం భీం చౌక్‌ వద్ద మండలంలోని ఆదివాసీ సర్పంచ్‌లు, నాయకులు కుమరం భీం విగ్రహానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సోయం భీంరావు, కోట్నక వెంకట్‌రావు, దౌలత్‌రావు, దేవరావు, మండలంలోని ఆదివాసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీలపెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అదిత మాట్లాడుతూ చీలపెల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై తన సొంత ఖర్చు నిధులతో ఆదివాసి గిరిజనుల కోసం రోడ్డు, రెండు వంతెనల నిర్మాణం పక్షం రోజుల్లో చేయించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే భీం ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. గిరిజనుల కోసం కాంగ్రెస్‌ పార్టీ వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంట గోపాల్‌, గెడెం నగేష్‌, సర్పంచులు భీంరావు, మాజీ సర్పంచు యాదగిరి బ్రహ్మయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి) కౌటాల, గురుడుపేటతో పాటు పలు గ్రామాల్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు కుమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి, గిరిజన నాయకుడు కుమరం మాంతయ్య, మన్నెవార్‌ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బా బాపు, ఆదివాసి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సదాశివ్‌, గౌరవ అద్యక్షులు బ్రహ్మయ్య, సర్పంచ్‌ నక్క శంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతలమానేపల్లి, ఖేతిని, దిందా, బాబాసాగర్‌, కర్జెల్లి, ఆడెపల్లి తదితర గ్రామాల్లో ఆదివాసీ నాయకులు, ప్రజలు ఉత్సాహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింభిచేలా నృత్యాలు చేశారు. అనంతరం అమర వీరుడు, గిరిజన హక్కుల కోసం పోరాడిన భీం చిత్రపటానికి పూల మాలలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోశక్క, మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌; శంకర్‌, ఎస్సై కమలాకర్‌, పెద్దలు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దహెగాం, చిన్నరాస్పెల్లి, మొట్లగూడ, కుంచవెల్లి, హత్ని తదితర గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంగడిబజారు ఏరియాలో ఆదివాసీల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సై సీహెచ్‌ రమేష్‌, ఆదివాసి సంఘాల నాయకులు రాకేష్‌, లగ్గాం దామోదర్‌, కమల, శ్రీను, ఆశోక్‌, కనకయ్య, ఏఎస్సై రమేశ్‌ పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాకడ ఎక్స్‌ రోడ్డు నుంచి కుమరం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా డోలు, వాయిద్యాలు, నృత్యాలు చేశారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌ రావు, లక్ష్మణ్‌రావు, అంబారావు, జగన్నాథ్‌రావు, శ్యాంరావు, రాజేశ్వర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుమరం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంఽధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కుమరం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ కుమరం భీం ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: (ఆంఽధ్రజ్యోతి): లింగాపూర్‌ మండలాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లింగాపూర్‌ మండలంలోని కంచన్‌పల్లి, చిన్నదంపూర్‌, లొద్గిగూడా, లింగాపూర్‌ జాముల్‌ధరా, గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో ఆదివాసీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కుమరం భీం విగ్రహానికి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, సర్పంచ్‌లు ఆత్రం ఓంప్రకాష్‌, కుమ్ర భీంరావు, మెస్రం భూపతి,మాజీ సర్పంచ్‌ ఆర్క నాగోరావు,స్థానిక ప్రజప్రతినిధులు,ఆదివాసీ సంఘాల ప్రతినిధుల జూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఆత్రం జ్యోతిరాంఉ,ఆత్ర శ్రీరావు,దుర్వ లాచ్చు,కోట్నాక పాండురంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆదివాసీలు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం కుమరం భీం విగ్రహానికి పూలమా వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ ఓంప్రకాష్‌, ఎస్సై సర్తాజ్‌పాషా, ఆదివాసీ నాయకులు ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్‌ డీఎస్పీ అశోక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జైనూర్‌ సీఐ రమేశ్‌ అధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 09 , 2026 | 10:23 PM