Share News

kumaram bheem asifabad-‘రెవెన్యూ’పై పనిభారం..

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:27 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాల వరుసతో రెవెన్యూ శాఖ అధికారులపై పనిభారం రోజురోజుకూ పేరుకపో తోంది. ఏడాదిన్నర కాలంగా కొత్త పథకాలు, ప్రత్యేక సర్వేలు, భూ సంబంధిత కార్యక్రమాలు, క్షేత్రస్థాయి తనిఖీలు, నిరంతర సమీక్షలతో అధికారులు విశ్రాం తి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.

kumaram bheem asifabad-‘రెవెన్యూ’పై పనిభారం..
లోగో

- సమీక్షలు..సర్వేలతో ఊపిరి సలపని పరిస్థితి

- అనారోగ్యంతోనూ సిబ్బంది విధులకు హాజరు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాల వరుసతో రెవెన్యూ శాఖ అధికారులపై పనిభారం రోజురోజుకూ పేరుకపో తోంది. ఏడాదిన్నర కాలంగా కొత్త పథకాలు, ప్రత్యేక సర్వేలు, భూ సంబంధిత కార్యక్రమాలు, క్షేత్రస్థాయి తనిఖీలు, నిరంతర సమీక్షలతో అధికారులు విశ్రాం తి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒక కార్యక్రమం పూర్తి కాకముందే మరో కార్యక్రమం ప్రారంభం కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఊపి రి సలపని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు అధికారు లు వాపోతున్నారు.

- బహుముఖ పనుల్లోనూ..

రెవెన్యూ శాఖ ప్రస్తుతం కేవలం దైనందిన పరి పాలనకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న బహుముఖ పనుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సాదాబైనామా దరఖాస్తుల పరి శీలన, రెవెన్యూ సదసుస్సల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, భూ భారతి దరఖాస్తుల నమోదు, ప్రస్తుతం అత్యంత ప్రాదాన్యతగా సాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కాగా, తాజాగా భూ రీసర్వే ప్రారంభమైంది. వీటికితోడు ప్రజాప్రతినిధుల పర్యటనల ఏర్పాట్లు, ఉన్నతాధికారుల ఆకస్మిక తని ఖీలు, నిరంతరాయంగా ప్రత్యేక నివేధికల సమర్పణ లో బిజీగా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా వీటితో పాటు విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ, రిజిస్ర్టేషన్లు, భూ తగాదాలు వంటి కార్యక్రమాలే కాకుండా ప్రస్తుతం 22ఏ నిషేధిత భూముల సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.

- రెండు రెవెన్యూ డివిజన్లలో..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో రెండు రెవెన్యూ డివిజన్లలో 15 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో 400మందికి పైగా అధికార, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఏడాదిన్నర కాలంగా తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా అధికారులు శారీరక, మానసిక, అనా రోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగిందని, నిద్రలేమి, తీవ్ర మానసిక ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరిగిపోతు న్నాయని అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలున్నా సెలవు తీసుకోకుండా విధులకు హాజరు కావాల్సి వస్తోందని చెబుతున్నారు.

- తీరిక లేని పనులతో..

నిరంతర విధులతో తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పిల్లల చదువులు, వారి అవసరాలను పట్టించుకునే తీరిక దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. బంధువుల శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరై నెలలు గడుస్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా మనోవేధనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9గంటలకే కార్యాలయానికి చేరుకుంటే రాత్రి 11దాటినా విధులు ముగియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరి నుంచి ఫోన్‌ వస్తుందో ఏ సమస్యపై తక్షణ మే నివేదిక ఇవ్వాల్సి వస్తుందో తెలియని ఆందోళ నలో బతుకుతున్నామని వాపోతున్నారు. సమీక్షలు, కాన్పరెన్స్‌లతో సగం సమయం అయిపోతుందని పలువురు అధికారులు ఆవేదన చెందుతున్నారు. దీంతో కుటుంబాలకు దూరంగా గడపాల్సిన పరిస్థి తులు ఉన్నాయంటూ వాపోతున్నారు. సమీక్షలు, వీడియో కాన్పరెన్స్‌లను రాత్రివేళల్లో కాకుండా నిర్ణీత కార్యాలయ వేళల్లోనే ముగించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సిబ్బంది కొరత తీర్చాలని కోరుతున్నారు. అన్ని రకా ల సర్వేలు, పథకాల బాధ్యతలను కేవలం రెవె న్యూ పైనే కాకుండా పలు శాఖలను భాగస్వామ్యం చే యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 10:27 PM