Share News

ఆర్టీసీ కార్మికులకు పనిభారం తగ్గించాలి

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:31 PM

టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులపై పెంచిన పనిభారాన్ని తగ్గించా లని, ఉద్యోగ భద్రత కల్పించా లని, ఉద్యోగ కార్మికులతో జరి గిన చర్చల్లో అంగీకరించిన అం శాలను వెంటనే అమలు చేయా లని కోరూతూజిల్లాలోని పలు డిపోలలో ఎస్‌డ బ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఆర్టీసీ కార్మికులకు పనిభారం తగ్గించాలి
అచ్చంపేట బస్టాండ్‌ అవరణలో దీక్షలో పాల్గొన్న కార్మికులు

- ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో పలు డిపోల ఎదుట ఒకరోజు నిరాహార దీక్షలో నాయకులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ కొల్లా పూర్‌/ అచ్చంపేటటౌన్‌/ కల్వ కుర్తి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులపై పెంచిన పనిభారాన్ని తగ్గించా లని, ఉద్యోగ భద్రత కల్పించా లని, ఉద్యోగ కార్మికులతో జరి గిన చర్చల్లో అంగీకరించిన అం శాలను వెంటనే అమలు చేయా లని కోరూతూజిల్లాలోని పలు డిపోలలో ఎస్‌డ బ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మం గళవారం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నాగర్‌కర్నూల్‌లో నాగ ర్‌కర్నూల్‌ డిపో గౌరవాధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస్‌, కొల్లాపూర్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిపో గౌరవాధ్య క్షుడు శివవర్మ, అచ్చంపేటలో జరిగిన ఒక్కరో జు దీక్షలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజియన్‌ కార్యదర్శి వెంకటయ్య, కల్వకుర్తిలో సీఐటీయూ డిపో గౌర వాధ్యక్షుడు ఆంజనేయులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా సమ్మె చేసిన అనంతరం ప్రభుత్వం చొరవతో యాజ మాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ప లు అంశాలపై అంగీకారం తెలిపిందని నాయ కులు అన్నారు. ఆ హామీల అమలులో జాప్యం జరుగుతోందని, వెంటనే అమలు చేయాలని, పెంచిన పనిభారం తగ్గించాలని, కార్మికులకు ఉ ద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిపో కార్యదర్శి చింతలయ్య, నాయకులు నందీ శ్వర్‌, వెంకటేశ్వర్లు, లింగయ్య, అర్జున్‌, వెంకట వర్దనమ్మ, కొల్లాపూర్‌లో నాయకులు ఉషాకు మార్‌, బీఎస్‌ చారి, ఈయూ నాయకులు రామ య్య, డిపో నాయకులు జీఎంకృష్ణ, కేవీనాయు డు, సంఘీభావం తెలిపారు. సీహెచ్‌ వెంకటేష్‌, బాలస్వామి, తిరుపతయ్య, నర్సింహ, బాలస్వా మి, అంబయ్య, అచ్చంపేటలో టీఎంయూ రాష్ట్ర నాయకులు నాగయ్యగౌడ్‌, కమిటీ సభ్యులు అంనంత రాములు, నారాయణ, శ్రీనివాసులు, కేబీగౌడ్‌, పర్వతాలు, వెంకటేశ్వర్లు, కల్వకుర్తిలో డిపో కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాజబాబు, నాగయ్య, కోశాధికారి పరిపూర్ణయ్య, సర్దార్‌సింగ్‌, శ్రీనివాసులు, బాలస్వామిలు కూర్చోగా ఎండీ నజీర్‌, ఈశ్వరమ్మ, బాలకిష్టమ్మ పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:31 PM