Share News

కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి...

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:51 PM

మంచి ర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అ న్నారు. పాత మంచిర్యాల 14వ డివిజన్‌లో ప్రజాపా లనలో భాగంగా మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, కార్పొరేటర్‌ తూముల నరేశ్‌తో క లిసి వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.

 కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి...
పాతమంచిర్యాలలో డ్రైనేజీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, మేయర్‌ మధూకర్‌

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, మార్చి14 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అ న్నారు. పాత మంచిర్యాల 14వ డివిజన్‌లో ప్రజాపా లనలో భాగంగా మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, కార్పొరేటర్‌ తూముల నరేశ్‌తో క లిసి వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భభంగా వారు వార్డు సమస్యలు గుర్తిం చి వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనలో భాగంగా అన్ని డివిజ న్లలో సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరించేందు కే ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ముఖ్యంగా పా రిశుధ్యం, మంచినీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు వం టి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టా లన్నారు. పాత మంచిర్యాలలో గతంలో పాలించిన పా లకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. డివి జన్‌ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అం దిస్తానన్నారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ ఎ మ్మెల్యే సహకారంతో అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొలిశెట్టి కిషన్‌, బొల్లం భీమయ్య, చింతకింది మల్లయ్య, తూము ల ప్రభాకర్‌ పాల్గొన్నారు.

పనులు మరింత వేగవంతం చేయండి

నస్పూర్‌: నస్పూర్‌లోని అన్ని డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అధికారులను ఆదేశిం చారు. 37వ డివిజన్‌లో ప్రగతి నగర్‌, పటేల్‌ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులు, ఇతర పను లను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజా పాలన, శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత పై స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డివిజన్‌లో కొనసా గుతున్న డ్రైవ్‌ను పరిశీలించారు. మురుగు కాలువలు, రోడ్లు, విద్యత్‌ లైట్లు తదితర వాటిని తొందరగా ఏర్పా టు చేయాలన్నారు. స్థానికులు పలు సమస్యలను ఎ మ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటిని విని సంబంధిత అ ధికారులకు మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదే శించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్లా రమ్య, కమిషనర్‌ అన్వేష్‌, కా ర్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:51 PM