Share News

మహిళల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:37 PM

మహిళల అభివృద్ధికి ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి హాజరై కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు.

మహిళల అభివృద్ధికి కృషి
చెన్నూరులో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్‌లను అందజేస్తున్న మంత్రి వివేక్‌వెంకస్వామి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-మంత్రి వివేక్‌వెంకస్వామి

చెన్నూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : మహిళల అభివృద్ధికి ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి హాజరై కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఒక్కో కుట్టు మిషన్‌ రూ. 12 వేల విలువతో 360 మంది మైనార్టీ మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. లబ్దిదారులకు తగు శిక్షణ ఇప్పించి తదనంతరం పని కల్పిస్తామన్నారు. కుట్టు మిషన్‌లను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అలాగే అంగ్రాజ్‌పల్లిలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, కుమ్మరికుంటలో రూ. 1.87 కోట్లతో పునరుజ్జీవ పనులకు శంకుస్ధాపన చేశామన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అమృత్‌ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్‌ అందించి శుద్దమైన తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 10:37 PM