Share News

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:22 AM

గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం ఎమ్మెల్యే సీసీకి వినతిపత్రం అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
వేములవాడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కార్మికులు

వేములవాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం ఎమ్మెల్యే సీసీకి వినతిపత్రం అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, 2వ పీఆర్సీ వర్తింపజేయాలని. జీవో నంబరు 51ని సవరించాలని, మల్టీపర్పస్‌ పర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ. 50 కోట్ల బడ్జెట్‌ ద్వారా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేసి, కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించాలని అన్నారు. కార్మికులకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ. 20 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్‌ స్థాయిలో ఎలాంటి వైద్య సదుపాయం ఉందో అలాంటి ఉచిత వైద్యం కోసం హెల్త్‌కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఎగమాంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్‌, అన్నల్‌దాస గణేష్‌, నాయకులు అంజయ్య, శ్రీనివాస్‌, మల్లయ్య, రవీందర్‌, నరేష్‌, నర్సయ్య, రాజశేఖర్‌, అనిల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:22 AM