కూలీలకు పనులు కల్పించాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:23 PM
ఎల్‌నినో ప్రభావం తో ఏర్పడిన కరువు పరిస్థితులతో కూలీలు వలసలు వెళ్లకుండా వీబీ జీరాంజీ పథకం ద్వారా ప్రతీ ఒక్క రికి పని కల్పించాలని డీఆర్‌డీవో చిన్న ఓబులేష్ అన్నారు.
- డీఆర్‌డీవో చిన్న ఓబులేష్
అమ్రాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావం తో ఏర్పడిన కరువు పరిస్థితులతో కూలీలు వలసలు వెళ్లకుండా వీబీ జీరాంజీ పథకం ద్వారా ప్రతీ ఒక్క రికి పని కల్పించాలని డీఆర్‌డీవో చిన్న ఓబులేష్ అన్నారు. గురువా రం అమ్రాబాద్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో అమ్రాబా ద్, పదర మండలాలకు సంబంధించి టీజీఐ ఎల్‌పీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కోచ్‌లకు ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులపై అవ గాహన కల్పించారు. ఉపాధి హామీ సిబ్బందితో పాటు టీజీఎల్‌పీ కోచ్‌లు కూడా ఆయా గ్రామా ల్లో పనుల్లో పాల్గొనే విధంగా చూడాలని ఆయ న సూచించారు. ఈ కోచ్‌లకు ఉపాధి హామీ పథకంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఎల్ పీ అఽధికారులు జయరాం, ఆంజనేయులు, దివ్య, అమ్రాబాద్ ఎంపీడీవో రామన్న, పదర ఎంపీడీ వో సుధాకరాచారి, ఏపీవో రఘుమూర్తి, ఏపీఎం శ్రీదేవి, ఈసీ రేణయ్య, మండల మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.