బీఆర్‌ఎస్ పాలనలో కార్మికుల హక్కులు కాలరాశారు
ABN , Publish Date - May 22 , 2026 | 10:54 PM
గత బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టు కార్మికుల హక్కులు కాలరాశారని, కనీస వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు మంద తిరుమల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేర్కొన్నారు.
-కాంగ్రెస్ పాలనలో కార్మికులకు పెద్దపీట
మందమర్రిటౌన్, మే 22 (ఆంధ్రజ్యోతి) : గత బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టు కార్మికుల హక్కులు కాలరాశారని, కనీస వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు మంద తిరుమల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని రాష్ట్రీయ రహదా రిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌వెంకట స్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చే శారు. వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల, కార్మి కుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారన్నా రు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 11 లక్షల మం దికి లబ్ది చేకూర్చేలా వేతనాలు పెంచడం మామూలు విషయం కాదన్నారు. పెరిగిన వేతనాలు జూన్ 1 నుం చి అమలులోకి వస్తాయని సీఎం చెప్పారన్నారు. వేత నాల పెంపు కోసం కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణిలో కూడా కాంట్రాక్టు కార్మికుల సంబరాలు మిన్నంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపతి బానేష్, నోముల ఉపేందర్‌గౌడ్, ఆకారం రమేష్, సొత్కు సుద ర్శన్, చిప్పకుర్తి శశి తదితరులు పాల్గొన్నారు.