kumaram bheem asifabad-పని ఒత్తిడి
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:55 PM
గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.
- బాధ్యతలు పెరిగినా అరకొర వేతనాలేనని ఆవేదన
కెరమెరి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పల్లెల ప్రగతికి, ప్రజల అవసరాలను నిరం తరం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ, పన్నుల వసూలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించే పంచాయతీ కార్మికులు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి ఉద్యోగ భధ్రత, వేతనాల, సంక్షేమంపై ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. గ్రామ పంచాయ తీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ విధానం కార్మికులను ఇబ్బందుల్లోకి నెడుతోందని పలువురు కార్మికులు ఆ వేదన చెందుతున్నారు. ఒకే వర్కర్‌తో పారిశుధ్య పను లు, విద్యుత్ దీపాల మరమ్మతులు, పంపు ఆపరేటర్ పనులు చేయించటం వల్ల సాంకేతిక పరిజ్ఙానం లేక విద్యుత్ ఫ్రమాదాల బారిన పడుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
- పని విభజన చేయాలని,
హోదాల ప్రకారం పని విభజన చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి ఎవరి పని వారికి కేటాయించాలని కోరుతున్నారు. ఎలక్ట్రిషియన్, వాటర్ సప్లైయి ఆపరేటర్, స్వీపర్ వంటి హోదాల ప్రకారం బాధ్యతలు అప్పగించాలని అంతా కోరుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న అరకొర వేతనాలు కుటుంబ సభ్యు నిర్వహణకు సరిపోవడం లేదని శ్రమకు తగ్గట్టుగా ప్రతి నెలా కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనానికి అందించాలంటున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్ల్ అనుభవనాన్ని గుర్తించాల్సిన అవసర ఉందని జీపీల్లో కీలక రికార్డులు, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని పలువురు కారోబార్లు కోరుతున్నా రు. వారికి సర్వీస్ ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలని అలాగే స్కేల్ వేతనం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ ల్లో కార్మి కులకు మూడు నుంచి ఆరు నెలల వరకు జీతాలు రావాల్సి ఉంది. దీంతో వారు అప్పులు చేయక తప్పటం లేదు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా పక్కా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొంత మంది సిబ్బందికి ఇప్పటికే ఈఎ స్‌ఐ, పీఎఫ్ అమలు కావడం లేదని, ఆరోగ్యపరంగా అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీపీ కార్మికులు, సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పంచాయతీ కార్మికుల ఇబ్బందులు..
- శ్రీకాంత్, పంచాయతీ కార్మిక సంఘం నాయకుడు
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు మల్టీపర్పస్ విధానం అమలుతో ఇబ్బం దులు పడు తున్నారు. ప్రధానంగా వారి స్కిల్‌ను గుర్తించి వివిధ విభాగాల్లో విధులు కేటాయిస్తే బాగుంటుంది. సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ నెలనెలా అందిం చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.