Share News

kumaram bheem asifabad- అర్హులైన ఉపాధి కూలీలకు పని కల్పించాలి

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:16 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలకు పని కల్పించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడారు. జాబ్‌ కార్డులు కలిగి ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆ దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు ప్రతి గ్రామంలో కూలీలతో మాట్లాడి పనికి వచ్చేలా సమావేశాలు నిర్వహించాల న్నారు.

kumaram bheem asifabad- అర్హులైన ఉపాధి కూలీలకు పని కల్పించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆయా శాఖల అధికారులు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలకు పని కల్పించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడారు. జాబ్‌ కార్డులు కలిగి ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆ దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు ప్రతి గ్రామంలో కూలీలతో మాట్లాడి పనికి వచ్చేలా సమావేశాలు నిర్వహించాల న్నారు. పని ప్రదేశాల వద్ద కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కూలీలకు పని కల్పించని వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించలేదన్నారు. అధికారుల సమన్వయంతో వ్యవహరించి ప్రతీ ఒక్కరికి పని కల్పించాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీహాల్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జాబ్‌ కార్డులు కలిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ప్రారంభం కాని గ్రామాల్లో వెంటనే కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 11:16 PM