పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:36 PM
బాలసదనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ మండలంలో కొనసాగుతున్న బాల సదనం నిర్మా ణ పనులను పరిశీలించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : బాలసదనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ మండలంలో కొనసాగుతున్న బాల సదనం నిర్మా ణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇం జనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ. 1.34 కోట్లతో మిషన్ వాత్సల్య అం చనా నిధులతో బాలసనదం భవనం నిర్మాణం పనులు చేపట్టమ న్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం మంచి ర్యాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ రహదారి 63,163 జీ రహదారుల ఏర్పాటులోభాగంగా జిల్లాలోని ప్రాం తాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాల న్నారు. అనంతరం పాత మంచిర్యాలలో నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవోశ్రీనివాసరావు ఉన్నారు.