పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:34 PM
: సిటీ గ్యాస్ డిస్ర్టి బ్యూషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొ న్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : సిటీ గ్యాస్ డిస్ర్టి బ్యూషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొ న్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ప రిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమ ర్థవంతంగా ఎదుర్కొనేందుకు పైపులైన్, సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూసన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుమతుల ప్ర క్రియను సరళీకరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలి పారు. సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ పనులకు సంబంధించిన అనుమతులను 24 గంటల్లో మంజూరుచేసే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ఆలస్యం అయితే డీమ్డ్ పర్మిషన్‌గా పరిగణిస్తామన్నారు. సిటీ గ్యాస్ డిస్ర్టి బ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించిన రెంటల్, లీజ్ ఛార్జీలను తా త్కాలికంగా మాఫీ చేశామని, పనుల వేగవంతానికి సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూ షన్ సంస్థలకు 24 గంటల పని సమయం, శబ్ద కాలుష్యం నిబంధనలు పాటించేలా అనుమతులు ఇస్తామన్నారు. అన్ని శాఖల పరస్పర సమన్వ యంతో పనిచేసి సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్‌సింగ్, జిల్లా అదనపు కలెక్టర్‌లు శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, మున్సిపల్ కమీషనర్‌లు పాల్గొన్నారు.