Share News

kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Feb 21 , 2026 | 10:52 PM

మహిళా సమాఖ్య భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సిర్పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని రెబ్బెన గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శనివారం శంకుస్థాపన చేశారు.

kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

బెజ్జూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మహిళా సమాఖ్య భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సిర్పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని రెబ్బెన గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి మహిళా సమాఖ్య భవనం, ప్రతి మండలంలో ఒక చోట రూ.30 లక్షల అంచనాతో గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, నాయకులు వెంకటేష్‌, సతీష్‌ పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

బెజ్జూరు మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన అర్పటి గణేశ్‌ వారం రోజుల క్రితం మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యేహరీష్‌బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట సర్పంచ్‌ రాజయ్య, నాయకులు వెంకటేష్‌, సతీష్‌, తదితరులు ఉన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుక రావాలని ఎమ్మెల్యే హరీష్‌ బాబు అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లిలో ట్రై విలేజీ ప్రిమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటల ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం విన్నర్‌గా గెలిచిన అందవెల్లి జట్టుకు, రన్నర్‌గా నిలిచిన భట్టుపల్లి జట్టు క్రీడాకారులకు బహుమతులు, మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పిరిసింగుల తిరుపతి, నాయకుడు చిప్పకుర్తి శ్రీనివాస్‌, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 10:53 PM