kumaram bheem asifabad- అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:06 PM
అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రజిత్‌కుమార్ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు
తిర్యాణి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రజిత్‌కుమార్ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం వరకు సిబ్బందితో కలిసి ర్యాలీగా వచ్చారు. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ తీరును పరిశీలించారు. మండలంలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ పరికరాలను పరిశీలించారు. ఆయన వాటిని కార్యాలయ సమావేశాల కోసం వినియోగించామని సూచించారు. జీపి కార్యాలయంను సందర్శించి రూ.30 లక్షలతో జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. డిజిటల్ సాధికారతతో భాగంగా తిర్యాణి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు 50 కంప్యూటర్లు, 30 ప్రింటర్లు, 5 ప్రొజెక్టర్లు, 40 టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచ పరిణామాలను తెలుసుకోవడానికి సహయం కలుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న అత్యంత వెనకబడ్డ జిలాల అభివృద్దిపై ఆయన శ్రద్ద వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కొత్త ఆధార్ సెంటర్, రోడ్లు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగను న్నాయని చెప్పారు. మండలంలో 484 గ్రూపుల కోసం రూ.14.31 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టారు. సీఐఎఫ్ నిధులతో రూ.1.30 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందించబడ్డాయన్నారు. రుణాల రికవరీ వంద శాతం కావడంతో సంతృప్తి వ్యక్తం చేవారు. గుడిపేటలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు, ఉల్లిపిట్ల, జెండాగూడ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాలను పరిశీలించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారాం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.