Share News

మైనర్‌ కాల్వల పనులు ప్రారంభం

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:05 AM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో నిర్మించిన బీ.వెల్లెంల ఉదయ సము ద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రధాన ఎడమ కాల్వకు అనుబఽంధంగా ఉండే మైనర్‌, సబ్‌మైనర్‌ నిర్మాణ పనులు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమ య్యాయి.

మైనర్‌ కాల్వల పనులు ప్రారంభం
అలైన్‌మెంట్‌ మేరకు ముగ్గుతో వేసిన మార్కింగ్‌

బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎడమ కాల్వ మైనర్‌, సబ్‌ మైనర్‌ పనులు

నార్కట్‌పల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో నిర్మించిన బీ.వెల్లెంల ఉదయ సము ద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రధాన ఎడమ కాల్వకు అనుబఽంధంగా ఉండే మైనర్‌, సబ్‌మైనర్‌ నిర్మాణ పనులు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమ య్యాయి. రిజర్వాయర్‌ నుంచి సుమారు 6.5కిలోమీటర్లు ఉన్న మునుగోడు మండలంలోని కిష్టాపురం వద్ద ముగియనున్న ప్రధాన ఎడమ కాల్వకు సం బంధించిన భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఈ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మొత్తం నాలుగు డిస్ర్టిబ్యూటరీలు ఉండగా వీటిలో మూడు డిస్ర్టిబ్యూ టరీలకు సంబంధించి సబ్‌ మైనర్‌లతో సహా భూసేకరణ దాదాపు పూర్త యింది. మరో డిస్ర్టిబ్యూటరీకి సంబంధించి భూ సేకరణ పూర్తయ్యే దశలో ఉంది. పూణెకు చెందిన సన్‌భీమ్‌ సంస్థకు కాల్వల నిర్మాణ పనులు బాధ్యత అప్పగించారు. ఐబీ(సీఏడీ) నల్లగొండ జిల్లా సీఈ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్టు డీఈఈ పిచ్చయ్య సమక్షంలో పిల్ల కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బీ.వెల్లెంల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రధాన ఎడమ కాల్వకు సంబంధించిన అలైన్‌ మెంట్‌ మేరకు అవార్డు ప్రక్రియ పూర్తై రైతుల ఖాతాల్లోకి పరిహారం డబ్బులు జమ అయిన గ్రామాల్లోని రైతుల భూముల్లో సంబంధిత ప్రాజెక్టు ఏఈఈలు కాల్వ అలైన్‌మెంట్‌ మేరకు మార్కింగ్‌, డోజింగ్‌ (భూమిని చదును) చేసే పను లు చేపట్టారు. రిజర్వాయర్‌ నుంచి ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా పిల్ల కాల్వల కోసం సేకరించిన రైతుల భూముల్లో కాల్వ తవ్వ కం కోసం మార్కింగ్‌ ప్రక్రియను చేపట్టి భూ స్వాధీన చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే అలైన్‌మెంట్‌ హద్దుల మేరకు ప్రతి 25మీటర్ల చొప్పున కాల్వకు ఇరువైపులా రెడ్‌ ఫ్లాగ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:05 AM