Share News

kumaram bheem asifabad-మార్చి 15 నాటికి పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:16 PM

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్పు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి ఇంజనీరింగ్‌ అధికారులు, అటవీ శాఖ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు, సెర్ప్‌ ఏపీఎంలతో అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-మార్చి 15 నాటికి పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్పు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి ఇంజనీరింగ్‌ అధికారులు, అటవీ శాఖ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు, సెర్ప్‌ ఏపీఎంలతో అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులలో భాగమైన పాఠశాలలో మూత్రశాలల నిర్మాణాలు, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, వంటశాలల నిర్మాణాలు, సీసీ రోడ్లు, ఫూడ్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గోదాం, గ్రామాలోల గ్రామ సమాఖ్య భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో 222 భవనాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున రూ.30 లక్షలతో ఫూడ్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గోదాం నిర్మాణం చేపట్టాలని అన్నారు. జిల్లాలో 15 మండలాల్లో 15 గోదాంల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడైనా స్థల గుర్తింపు సమస్య ఉన్నట్లయితే స్థానిక తహసీల్దార్‌ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఉన్నందున వారి సహకారంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. సంపూర్ణత అభియాన్‌ 2.0లో భాగంగా బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. అభివృద్ది పనులలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు వచ్చేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, ఏఈ ధర్మేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

కాగజ్‌నగర్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రెండవ సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని 30 ఆర్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 30 వార్డులకు 15 కౌంటర్లలో నామినేషన్లు స్వీకరించనున్నామని చెప్పారు. నామినేషన్‌ కేంద్రం వద్ద బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నామినేషన్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు వివరించారు. అనంతరం పలు సూచనలు, సలహాలను సిబ్బందికి సూచించారు. అనంతరం ఏవీ లక్ష్మిపత్‌ సింఘానియా పబ్లిక్‌స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్‌ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. అలాగే చెక్‌ పోస్టును సందర్శించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్‌ తిరుపతి, తహసిల్దార్‌ మల్లెపూల మధూకర్‌, నవోదయ ప్రిన్సిపాల్‌ రేపాల కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:16 PM