kumaram bheem asifabad- పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:56 PM
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారిలో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల పథకం, ఉపాధి హామీ పథకం కిందవ పాఠశాలల్లో మౌలిక వసతులు, బాలికల మూత్రశాలలు, గ్రామ సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలపై పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహవించారు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారిలో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల పథకం, ఉపాధి హామీ పథకం కిందవ పాఠశాలల్లో మౌలిక వసతులు, బాలికల మూత్రశాలలు, గ్రామ సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలపై పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద జిల్లాలో అన్ని యజమాన్యాల 720 పాఠశాలలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, మూత్రశాలల మరమ్మతులు, భవనాల మరమ్మతు పనులు చేపట్టిన వాటికి ఎంబీలు సమర్పించాలన్నారు. ఇంకా పూర్తి చేయని పనులను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద యూడైస్‌లో వివరాల ప్రకారం బాలికలకు ప్రత్యేక మూత్రశాలల నిర్మాణాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ సమాఖ్య, మండల సమాఖ్య భవనాల పనులను వెంటనే చేపట్టాలని చెప్పారు. స్థానిక సర్పంచ్‌ల భాగస్వామ్యంతో పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ భవనాలలో మౌలిక వసతుల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి బిల్లులు చెల్లించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ ధర్మేందర్, సెర్ప్ ఏపీఎంలుఉ, ఇంజనీరింగ్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తి చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సీఆర్పీలు కృషి సఖిలకు ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భావితరాలకు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిధ్దమైన వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించాలని, ప్రకృతి సేధ్యం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కలుషితమైన పంటలు పండించడం, వాటిని ఆహార రూపంలో తీసుకోవడం ద్వారా మానవులు వ్యాధుల బారిన పడుతున్నా రని చెప్పారు. అధిక మోతాదులో యూరియా, డీఏపీల వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులను వినియోగించి పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించాలని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, సహయ సంచాలకులు మనోహర్, మిలింద్‌కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు.