Share News

kumaram bheem asifabad- కష్టపడి పని చేయాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:40 PM

రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. లింగాపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు పర్యటించారు. మందుగా లింగాపూర్‌ మండల కేంద్రంలో కొనసాగుతున్న జగదంబాదేవి జాతరాకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను ప్రారంభించారు. అనంతరం హైమన్‌డార్ఫ వర్ధంతి పోస్టర్లు ఆవిష్కరించారు. మాన్కగూడాలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు

kumaram bheem asifabad-  కష్టపడి పని చేయాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు సుగుణ

లింగాపూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. లింగాపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు పర్యటించారు. మందుగా లింగాపూర్‌ మండల కేంద్రంలో కొనసాగుతున్న జగదంబాదేవి జాతరాకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను ప్రారంభించారు. అనంతరం హైమన్‌డార్ఫ వర్ధంతి పోస్టర్లు ఆవిష్కరించారు. మాన్కగూడాలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు త్వరలో రాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏన్నికల్లో కార్యాకర్తలు కష్టపడి పని చేసి కాంగ్రెస్‌ పార్టీ తరుపున నిలబడ్డ వారిని గెలిపించుకోవాలని అన్నారు. అందరు కష్టపడి అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కేంద్రా ప్రభుత్వం జాతీయ మహత్మగాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తీసేయడం సరైనది కాదని చెప్పారు. గ్రామాలలోని ప్రజలు ప్రతి గ్రామంలో ముడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మండలంలోని గ్రామ పంచాయతీల్లో నెలకొ న్న సమస్యలు సర్పంచ్‌ వినవించారు. దశాలావారీగా అన్ని గ్రామపంచాయతీలలోని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జాదవ్‌ లోకేందర్‌, స్థానిక సర్పంచ్‌ జాదవ్‌ రాజశేఖర్‌, సర్పంచ్‌లు రాథోడ్‌ ఉదయ్‌సింగ్‌, రాథోడ్‌ సునీత, మండలనాయకులు ఆత్రంఅనిల్‌, మేశ్రంబాది, మహదు, గంగు, చిరంజీవి, రమేశ్‌, గ్రామ నాయక్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 10:40 PM