మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:53 PM
మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందుకు ఏపథకం మొ దలు పెట్టిన మొదటి ప్యాధాన్యం మహిళలకే ఉంటుందని ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట మండలం సూ రారం గ్రామంలో మహిళ శక్తి పథకంలో బాగంగా మహిళ సంఘాలకు రెండవ విడుత చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందుకు ఏపథకం మొ దలు పెట్టిన మొదటి ప్యాధాన్యం మహిళలకే ఉంటుందని ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట మండలం సూ రారం గ్రామంలో మహిళ శక్తి పథకంలో బాగంగా మహిళ సంఘాలకు రెండవ విడుత చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షే మం, మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళ సాధికారతే లక్ష్యంగా మ న సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనేక పథకాలు మహి ళల కోసం ప్రవేశపెట్టామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు కొని ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రతీ ఒక్కటి మహిళల పేరునే ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుంద న్నారు. అనంతరం మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రెండవ విడత చీరలను డీఆర్‌డీవో కిషన్, అడిషనల్ కెలక్టర్ చంద్రయ్య, తో కలిసి అందించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ దిలిప్‌కుమార్, ఎం పీడీవో అనీల్, సర్పంచ్ బాను, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, మార్కెట్ కమి టీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, నాయకులు షాహెద్‌ఆలీ, అశోక్‌కుమా ర్, నాగభూషణం, ఆరీఫ్, రాజు, నర్సయ్య, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.