Share News

kumaram bheem asifabad- మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 25 , 2026 | 10:17 PM

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 254 నుంచి 30 వరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ వాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి స్వరూపారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి మహిళా వారోత్సవాల సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు

kumaram bheem asifabad- మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
స్టాల్‌ను పరిశీస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 254 నుంచి 30 వరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ వాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి స్వరూపారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి మహిళా వారోత్సవాల సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25న గ్రామ సంఘాల భవనాలు, మండల సమాఖ్య భవనాలు, భవనాల భూమి పూజ, శంకుస్థాప కార్యక్రమాలు నిర్వహించడం, అంగన్‌వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రుల కోసం వంట పోటీలను నిర్వహించాలని తెలిపారు. 26న బాల్య వివాహం- బతుకు ఆగం అనే నినాదంతో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. 27న వమిళల భద్రత పోష్‌ చట్టంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, 29న రుణ మేళా నిర్వహిచేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. 30న అమ్మమాట- అంగన్‌వాడీ బాట నినాదంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకకు ఏకరూప దుస్తుల పంపిణీ, విద్య ఆరంభ ధ్రువపత్రాల జారీ, కిశోర బాలికల కోసం స్నేహ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళా వారోత్సవాలను విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - May 25 , 2026 | 10:17 PM