Share News

kumaram bheem asifabad-మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:09 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ కెహరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొ ని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సర్‌ మంగ, జిల్లా మహిళా సమైఖ్య ప్రతినిధి వనితలతో కలిసి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు

kumaram bheem asifabad-మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ కెహరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొ ని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సర్‌ మంగ, జిల్లా మహిళా సమైఖ్య ప్రతినిధి వనితలతో కలిసి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అందరికి ఆదర్శకంగా ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రతి మహిళ సాటి మహిళలకు అండగా నిలువాలని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని, ప్రతి మహిళ జీవితంలో ఒడిదుడుగులు ఎదుర్కొన్న వారేనని తెలిపారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఎందరో మహిళలు దేశ ప్రధానిగా, రాష్ట్రపతులుగా పదువులు చేపట్టి దేశానికి సేవలు అందించారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ ఎదగాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల నందిని నృత్య నిలయం విద్యార్థినులు చేసిన నృత్యం, సన్నీ సెల్ఫ్‌డిఫెన్స్‌ అకాడమీ చిన్న పిల్లలు చేసిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌, జీసీడీవో శకుంతల, అధికారులు, ఉద్యోగులు, జిల్లా మహిళా సాధికార సభ్యులు శారద, రాణి, రాజేశ్వరి, మమత పాల్గొన్నారు.

రేపు సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు శిక్షణ

ఆసిఫాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గురువారం గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కార్యదర్శి సంజీవ్‌కుమార్‌, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, జిల్లా అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభురత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సర్పంచ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించాలన్నారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే వారికి తాగునీరు, భోజన వసతి కల్పించాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులను ఆహ్వానించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణకు వచ్చే వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేసి తాగునీరు, టీ, భోజన వసతి అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులను శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:09 PM