కొందరికే డబ్బులు ఇవ్వడం ఏందండి ?
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:50 AM
ఓటు కోసం వాళ్లకు డబ్బులు ఇచ్చారు.. మాకు ఎందుకు ఇవ్వలేదు..? అంటూ జనగామ 23వ వార్డుకు చెందిన పలువురు మహిళలు బీఆర్‌ఎస్..
బీఆర్‌ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మహిళల ఆందోళన
జనగామ రూరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఓటు కోసం వాళ్లకు డబ్బులు ఇచ్చారు.. మాకు ఎందుకు ఇవ్వలేదు..? అంటూ జనగామ 23వ వార్డుకు చెందిన పలువురు మహిళలు బీఆర్‌ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. జనగామ మునిసిపాలిటీలోని 23వ వార్డులో బీఆర్‌ఎస్ నుంచి మేకల రాంప్రసాద్ పోటీలో ఉన్నారు. రాంప్రసాద్ కొందరికే డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తూ పలువురు మహిళలు 23వ వార్డులోని సరస్వతి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగి రాంప్రసాద్‌ను దుర్బాషలాడారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులు ఆ మహిళలను శాంతిపజేయగా వారు ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయారు.