kumaram bheem asifabad- పదవుల్లో సతులు.. పవర్‌లో పతులు
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:50 PM
మహిళలకు ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, బంధువులే అధికారం చలాయిసు న్నారనే విమర్శలు జిల్లాలో తీవ్రంగా వినిపి స్తున్నాయి. అధికారిక సమావేశాలు, అధివృద్ది పనులు, సమీక్షలు, గ్రామ సభల్లో మహిళల స్థానంలో పురుషులే ముందుండడం ప్రజా స్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తొంది.
- పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఇదే తంతు
వాంకిడి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, బంధువులే అధికారం చలాయిసు న్నారనే విమర్శలు జిల్లాలో తీవ్రంగా వినిపి స్తున్నాయి. అధికారిక సమావేశాలు, అధివృద్ది పనులు, సమీక్షలు, గ్రామ సభల్లో మహిళల స్థానంలో పురుషులే ముందుండడం ప్రజా స్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తొంది. భారత రాజ్యాంగంలోని 73, 74వ సవరణలతో స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజాప్రనిధులుగా ఎన్నికయ్యారు. కానీ గెలిచిన తర్వాత పాలనా వ్యవహారాల్లో మాత్రం వారి భర్తలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళ సర్పంచ్, కార్పొరేటర్లు కేవలం అధికారిక సంతకాలకే పరిమితమవుతన్నారనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. సమావేశాలు, అధికారిక కార్యక్ర మాల్లో మహిళల స్థానంలో భర్తలు పాల్గొన డం తరచూ కనిపిస్తుంది. మహిళల కోసం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను కుటుంబ రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- వేదికలపై భర్తలదే హవా...
జిల్లాలో అనేక చోట్ల మహిళ ప్రజాప్రనిఽ దుల భర్తలే వ్యవహారాలు నడిపిస్తున్న ఘట నలు వెలుగుచూస్తున్నాయి. గ్రామ సభలు, అభివృద్ధి పనుల సమీక్షలు, అధికారులతో సమావేశాల్లో మహిళల బదులు భర్తలే హాజ రవుతున్నారు. కొన్నిచోట్ల అధికారిక ఫ్లెక్సిలపై మహిళా ప్రజాప్రతినిధి ఫొటోతో పాటు భర్త ఫోటోలను కూడా ముద్రిస్తున్నారు. భార్య సర్పంచ్‌గా ఉండగా భర్త ఉపసర్పంచ్‌గా ఉన్న గ్రామాల్లో మొత్తం వ్యవహారాలు భర్తే చూసే పరిస్థితి నెలకొంది. మునిసిపాలి టీల్లోనూ మహిళ కౌన్సిలర్లు గెలిచినా డివిజన్‌లలో భర్తలే అధికారులతో చర్చలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న మహి ళలకు నిర్ణయాధికారం దక్కకపోవడం ప్రజాస్వామ్యానికివిరుద్ధమని నిపుణులు చెబుతున్నారు.
- జిల్లాలో 170 స్థానాల్లో..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీల్లో 170 స్థానాల్లో మహిళా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. ప్రతి మండలంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా ఉంది. అయినప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో మహిలల కంటే వారి భర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారనే విమర్శలు వినిి పిస్తున్నాయి. మహిళల రాజకీయ ప్రాతిని ఽథ్యం సంఖ్యలకే పరిమితమైందని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భార్యల విధుల్లో వారి భర్తలు, బంధువుల జోక్యానికి తావు ఇవ్వొద్దని పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ స్పష్టమైన ఆదేశాలి చ్చింది. గ్రామ పంచాయతీలతో పాటు మం డల పరిషత్, జడ్పీలకు సైతం దీన్ని వర్తింప జేయాలని అధికారులు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదు. ఈ విషయమై గతంలో పలు జీవోలు వచ్చి నా క్షేత్రస్థాయిలో ఆశించినంత మార్పు రాలే దు. తాజాగా ఇప్పుడు వచ్చిన ఉత్తర్వుల్లో మార్పు వస్తుందా అన్న సందేహాం వస్తోంది. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహారిస్తే ప్రయోజనం చేకూరుతుంది.