Share News

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:43 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక మహిళ ల సంక్షేమం కోసం అనేక పథకాలలు అమలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ మహి ళలకు పెద్దపీట వేసిందని మహిళా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు దాచేప ల్లి సారిక అన్నారు.

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
ఆన్‌లైన్‌లో మహిళలకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలను చేయిస్తున్న నాయకురాలు దాచేపల్లి సారిక

- మహిళా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సారిక

తిమ్మాజిపేట, అక్టోబరు 11 (ఆం ధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక మహిళ ల సంక్షేమం కోసం అనేక పథకాలలు అమలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ మహి ళలకు పెద్దపీట వేసిందని మహిళా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు దాచేప ల్లి సారిక అన్నారు. మండల కేంద్రం లో మహిళా కాంగ్రెస్‌ పార్టీ నాయకు రాలు దాచేపల్లి సారిక ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఆమె మాట్లా డుతూ మహిళలను అధిక సంఖ్యలో పార్టీలో చేర్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మ హాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతిపథకం వంటివి మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతీ మహిళ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ బలో పేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చింతకింది లింగం, దాచేపల్లి రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 11:43 PM