25-31వరకు మహిళా వారోత్సవాలు: సీతక్క
ABN , Publish Date - May 22 , 2026 | 03:56 AM
ఆర్థికంగా, సామాజికంగా మహిళలు సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు...
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా, సామాజికంగా మహిళలు సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈనెల 29న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ కార్యక్రమం ప్రారంభోత్సవం, జీవనోపాధి యూనిట్ల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.