Share News

మహిళలే మహారాణులు...!

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:36 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మహిళలు బరిలోకిదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మహిళలే మహారాణులు...!

-మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లలో వారికే అందలం

-మహిళా కోటాలో ప్రత్యేకంగా 50 శాతం అమలు

-జనరల్‌ కేటగరీలోనూ బరిలో నిలవనున్న అతివలు

మంచిర్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మహిళలు బరిలోకిదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లతోపాటు ప్రత్యేక మహిళా కోటాతో కలిపి ప్రభుత్వం వారికి మొత్తంగా 50 శాతం సీట్లు కేటాయిం చింది.దీంతో రాజకీయ పార్టీలు సైతం మహిళలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్ప టి దాకా రాజకీయానుభవం లేకపోయినా, రిజర్వేష న్లు అనుకూలించినందున తమ కుటుంబాల్లోని మహిళలను పోటీలో నిలబెట్టడం ద్వారా పురుషులు తమ అదృష్టా న్ని పరీక్షించుకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహిళలు బరిలో నిలిస్తే ఆ విభాగం ఓట్లు తేలిగ్గా రాబట్టుకోవడంతోపాటు, చట్ట సభల్లోకి నారీ మణులు అధికంగా వెళ్లేలా ప్రజలే ప్రోత్సహించే అవకా శాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది.

రిజర్వేషన్లు మహిళలకే అనుకూలం...

మునిసిపల్‌ ఎన్నికల్లో మహిళలకు అన్ని విభాగాల్లో నిబంధనల మేరకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చే శారు. ఇవే గాకుండా మిగతా 50 శాతం సీట్లలో జనర ల్‌ కేటగరీకి కేటాయించే స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లో పోటీచేసి, గెలిచిన మహిళల సంఖ్య అధికంగానే ఉంది. ఈ మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లను ఆకర్శించేందుకు జనరల్‌ స్థా నాల్లో కూడా కొందరు మహిళలను రంగంలోకి దింపా లని ఆయా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారు. ము నిసిపల్‌ ఎన్నికలకు సంబంఽధించి జిల్లా లోని ఎన్నికలు జరుగనున్న మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో మ హిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ తోపాటు ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లోనూ స్ర్తీలే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అ దే ఒరవడి పునరావృతం కానుండటంతో వివిధ పార్టీ లకు చెందిన ముఖ్య నేతలు సైతం ఎక్కువగా మహి ళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొంది స్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వారి కోసం ప్రత్యేకంగా పలు పథకా లు ప్రవేశపెట్టింది. పలు పథకాలు ప్రత్యేకంగా మహిళ ల కోసం ఉద్దేశించినవే కావడంతో మహిళా ఓటర్లను ఆకర్శించడం తేలికనే భావనతో అధికార పార్టీ నాయకు లున్నారు. కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ ఎస్‌, బీజేపీలు సైతం మహిళలను రంగంలోకి దింపా లన్న యోచనలో ఉన్నాయి. జనరల్‌ స్థానాల్లోనూ అధిక సంఖ్యలో మహిళలను రంగంలోకి దింపితేనే తమ పని సులువు అవుతుందనే భావనలో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.

మహిళా రిజర్వేషన్లు ఇలా....

జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని డివి జన్లతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపే ట మునిసిపాలిటీల్లో మొత్తం 149 వార్డులకుగాను, వా టిలో మహిళకు 50 శాతానికి తగ్గకుండా మొత్తంగా 74 సీట్లను వారికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్‌లు ఉండగా, అందులో 50 శాతం కింద మహిళలకు 30 స్థానాలను రిజర్వ్‌ చేశారు. వాటిలో ఎస్సీ మహిళ-04, బీసీ మహి ళ-10, జనరల్‌ మహిళ-16 సీట్లు కేటాయించారు. అలాగే బెల్లంపల్లి మునిసిపాలిటీలో మొత్తం 34 వార్డులకు గా ను ఇక్కడ రిజర్వేషన్‌ దామాషానా మహిళలకు 50 శా తం కింద 17 స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు. బెల్లంపల్లిలో ఎస్సీ మహిళ-05, బీసీ మహిళ-03, జనరల్‌ మహిళ-09 సీట్లు కేటాయించారు. చెన్నూరు మున్సిపా లిటీ పరిధిలోని 18 వార్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ స్ర్థీలకు అమలు చేశారు. చెన్నూరులో మొత్తం తొమ్మిది స్థానాలను మహిళలకు కేటాయించారు. వాటిలో ఎస్సీ మహళ-01, బీసీ మహిళ-02, జనరల్‌ మహిళ-06 స్థానా లను రిజర్వ్‌ చేశారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలోని 22 వార్డులకు గాను మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కోటా ప్రకారం 11 స్థానాలను కేటాయించారు. వాటిలో ఎస్సీ మహిళ-03, బీసీ మహిళ-01, జనరల్‌ మహిళ-07 వార్డులను రిజర్వ్‌ చేశారు. అలాగే లక్షెట్టిపేట మునిసిపా లిటీలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కోటా అ మలు చేశారు. మహిళా కోటా కింద మొత్తం ఏడు స్థానాలను కేటాయించారు. వాటిలో ఎస్సీ మహిళ-01, బీసీ మహిళ-01, జనరల్‌ మహిళ-05 సీట్లను రిజర్వ్‌ చేశారు.

జనరల్‌ స్థానాల్లోనూ వారికే....

మునిసిపల్‌ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా జనరల్‌కు రి జర్వ్‌ అయిన స్థానాల్లో మహిళలే ప్రాతినిథ్యం చేయను న్నారు. జిల్లాలోని ఎన్నికలు జరుగనున్న ఆయా ఐదు మునిసిపాలిటీల్లో మొత్తం 149 వార్డులు ఉన్నాయి. వా టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ విభాగాలకు మొత్తం 78 స్థానాలను కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో మంచిర్యా ల కార్పొరేషన్‌లో ఎస్టీ-01, ఎస్సీ-05, బీసీ-10, జనరల్‌-14 స్థానాలు, బెల్లంపల్లి మునిసిపాలిటీలో ఎస్టీ-01, ఎస్సీ-05, బీసీ-03, జనరల్‌-08 స్థానాలు, చెన్నూరులో ఎస్టీ-01, ఎస్సీ-02, బీసీ-03, జనరల్‌-03 స్థానాలు, క్యాతన్‌పల్లిలో ఎస్టీ-01, ఎస్సీ-04, బీసీ జనరల్‌ -02, జనరల్‌-04 స్థానా లు, లక్షెట్టిపేటలో ఎస్టీ-01, ఎస్సీ-02, బీసీ-02, జనరల్‌ -03 స్థానాలు ఉన్నాయి. మునిసిపాలిటీల వారీగా ఆ యా కేటగరీలకు కేటాయించిన జనరల్‌ సీట్లలోనూ దా దాపు సగభాగం స్థానాల్లో మహిళలు పోటీ చేసే అవకా శాలు అధికంగా ఉన్నాయి.

Updated Date - Jan 18 , 2026 | 11:36 PM