Share News

kumaram bheem asifabad-ఎండుతున్న పొలాలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:25 PM

పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు పరిధిలో సాగు నీరు అంద క పొలాలు ఎండిపోతున్నాయి. దహెగాం మండలం కల్వాడ గ్రామ శివారులోని పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టులో నిండా నీరు ఉన్నా నిష్పప్రయోజ నంగా మారింది

kumaram bheem asifabad-ఎండుతున్న పొలాలు
ఎండిపోతున్న వరి పంట

దహెగాం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు పరిధిలో సాగు నీరు అంద క పొలాలు ఎండిపోతున్నాయి. దహెగాం మండలం కల్వాడ గ్రామ శివారులోని పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టులో నిండా నీరు ఉన్నా నిష్పప్రయోజ నంగా మారింది. ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని వదిలిన కల్వాడ సంత సమీపంలో కాల్వపై నుంచి సాగునీరు వృథాగా పోతోంది. సాగు నీరు అందక కుంచవెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, బామనగర్‌ తదితరులు సాగు చేసి వరి పంటలు సాగునీరు అందక పోవడంతో వరి పొలాలు బీటలు బారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2003 సంవత్సరం నుంచి పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు ద్వారా సాగునీరు రైతులకు సాగు నీరు అందు బాటులోకి వచ్చింది. ప్రధాన ఎడమ కాల్వ ద్వారా దహెగాం మండలంలోని వివిధ గ్రామాల్లోని 9వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతోంది. ప్రధాన కుడి కాల్వ ద్వారా మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలం లింగాల, చింతపుడి గ్రామాలకు 2వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన లక్ష్యంగా ఉంది. జూలై చివరి నాటికి వర్షాలు కురువ డంతో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీరు నిండింది. దీంతో రైతులు ప్రధాన ఎడమ కాల్వ కింద, హత్తి, పీపీరావు కాలనీ, కల్వాడ, కుంచవెల్లి, చంద్రపల్లి, బామనగర్‌, పీకలగుండం తదితర గ్రామాల్లోని రైతులు వరి పంటను సాగు చేశారు. వరి నాట్లు పూర్తి అయి నెల రోజులు కావడంతో రైతులు ఎరువులు కూడా చల్లారు. ప్రస్తుతం సాగు నీరు అందక పొలాలు బీటలు పారుతున్నాయని గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోక పోతే వరి పొలాలు ఎండి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- కల్వాడ తండా వద్ద..

దహెగాం మండలంలోని కల్వాడ తండా వద్ద ప్రధాన ఎడమ కాల్వ నుంచి సాగునీరు వృధాగా పో తోంది. అధికారులు పట్టించుకోక పోవడంతో కుంచ వెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, బామనగర్‌, ఓడ్డుగూ డ, బ్రాహ్మణ్‌ చిచ్చాల గ్రామాల్లో సాగు చేసిన వరి పంటకు సాగునీరు అందటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వృథాగా పోతున్న ప్రాజెక్టు నీటిని అడ్డుకట్ట వేస్తేనే తమకు పొలాలకు సాగునీరు అందుతుందని పలువురు గ్రామాల రైతులు చెబు తున్నారు. అధికారులు స్పందించి పొలాలకు సాగునీ రు అందించాలని రైతులు కోరుతున్నారు.

పదిహేను రోజులుగా నీరు రావడం లేదు..

- దుర్గం కేదారి, పీకలగుండం

పదిహేను రోజులుగా పొలాలకు ప్రాజెక్టు నీరు రావడం లేదు. రెండో సారి ఎరువులు కూడా వేశాం. నీరు అందక పోవడంతో పొలాల బీటలు బారుతు న్నాయి. అధికారులు, నాయకులు పట్టించుకొని సాగు నీరు అందేలా చూడాలి.

Updated Date - Oct 02 , 2026 | 11:25 PM