భయం భయంగా....
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:33 PM
పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాల్లో విద్యార్థులు భ యం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.
శిథిలావస్థలో బెల్లంపల్లిలోని వసతి గృహాలు
వర్షాలతో ఊడుతున్న స్లాబ్ పై పెచ్చులు
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు...ప్రజా ప్రతినిధులు
బెల్లంపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాల్లో విద్యార్థులు భ యం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. హాస్టళ్ల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని పైకప్పు పెచ్చులు ఊడిప డుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు వణుకుతున్నారు. పట్టణంలోని నడిబొడ్డున ఉన్న పాఠశాల, కళాశాల వసతి గృహాలు శిథిలావస్థకు చేరినప్పటికీ అధికా రులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడం విద్యార్థు లకు శాపంగా మారుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్లాబ్ పై పెచ్చులు ఊడి వర్షపు నీరు గదుల్లోకి చేరుతుం ది. ఈ హాస్టల్ భవనాలు ఎప్పుడు కూలుతాయోనని విద్యా ర్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
శిథిలావస్థలో....
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు దశాబ్దా ల కాలం క్రితం నిర్మించిన షెడ్యూల్డ్ కులాల బాలుర కళా శాల వసతి గృహంతో పాటు రడగంబాల బస్తీలో గల షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాలు ఉన్నాయి. దశా బ్దాల క్రితం నిర్మించి ఈ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ వసతి గృహాల్లో నియోజకవర్గంలోని వి విధ మండలాల విద్యార్థులతో పాటు కాగజ్‌నగర్, ఆసిఫా బాద్‌కు చెందిన విద్యార్థులు సైతం ఇందులో ఉంటారు. ప్రస్తుతం ఈ రెండు వసతి గృహాల్లో వంద మందికిపైగా విద్యార్థులు దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ హాస్టల్‌లో భోజనాలతో వసతి పొందుతున్నారు. ప్రస్థుతం ఇవి శిథిలావస్థ దశలో ఉన్నాయి.
వర్షాలకు ఊడుతున్న పైకప్పు పెచ్చులు...
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వసతి గృహాల్లోని పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. అంతేగాకుండా స్లాబ్ పై నుంచి వర్షపునీరు గదుల్లోకి చేరుతుండడంతో విద్యార్థులు ఉండలేని దుస్థితి ఏర్పడుతుంది. ఈ వసతి గృహాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం సరిగ్గా లేకపో వడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కళా శాల వసతి గృహంలో దాదాపు పది గదులు ఉండగా బాలుర వసతి గృ హంలో ఐదుకు పైగా గదులు ఉన్నాయి. ఈ రెండు హాస్టళ్లలో ప్రతి గదిలో స్లాబ్ పెచ్చులూడి ఇనుప రాడ్లు కనిపించే దృశ్యాలే కనిపిస్తాయి.
భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు...
ఇటీవల కురుస్తున్న వర్షాలతో హాస్టళ్లలోని గదుల పై పెచ్చులు ఊడి కిం దపడుతుండడం, గదుల్లోకి నీరు చేరుతుండడంతో విద్యార్థులు రాత్రి సమయంలో నిద్ర పోలేకపోతున్నారు. వసతి గృహాల్లో పారిశుధ్య లోపంతో విద్యా ర్థులకు సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం సైతం ఉంది. వసతి గృహా ల్లోని వంటశాలల్లోకి వర్షపునీరు చేరుతుండడంతో ఆహారం కలుషితం అ య్యే ప్రమాదం ఏర్పడుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు త్వ పాఠశాలల్లో చదివి సేద తీరడానికి వసతిగృహాలకు చేరుకున్న విద్యా ర్థులకు ప్రతి క్షణం నరకమే కనబడుతుంది. శిథిలావస్థలో ఉన్న ఈ వసతి గృహాల్లో విద్యార్థులు కాలం వెళ్ల దీస్తుండడంతో ఇటు విద్యార్థులతో పాటు అటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రజా ప్రతిని ధులు, అధికారులు శిథిలావస్థలో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులను ఖాళీ చేయించి ప్రత్యామ్నాయంగా ఇతర భవనాల్లోకి చేర్చి నూతన శాశ్వత వసతి గృహాలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు...
అల్లీసాగర్, ఆలిండియా స్టూడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు
దశాబ్దాల కాలం క్రితం నిర్మించిన ప్రభుత్వ వసతి గృహాల్లో పూర్తి శిథిలావస్థకు చేరాయి. ఇందులో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉం టున్నారు. వెంటనే విద్యార్థులను ఈ భవనాలు ఖాళీ చే యించి అన్ని వసతులు ఉన్న భవనాల్లోకి చేర్పించాలి.
శాశ్వత భవనాలు నిర్మించాలి....
సబ్బని రాజేంద్రప్రసాద్,
ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా నాయకులు...
శిథిలావస్థలో ఉన్న వసతి గృహాల్లోని విద్యార్థులను వెం టనే ఖాళీ చేయించాలి. ఈ భవనాలు కూల్చివేసి అన్ని వ సతులతో కూడిన నూతన భవనాలను నిర్మించాలి. ఈ వ సతి గృహాల్లో ఎలాంటి వసతులు లేనప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం సరైంది కాదు. ఇ ప్పటికైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతుల తో కూడిన భవనంలోకి మార్చాలి. లేని యెడల విద్యార్థి సంఘాలతో మమేకమై ఆందోళన చేస్తాం.