Share News

క్రీడల్లో గెలుపోటములు సహజం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:59 PM

ఆటలు మా నసికోల్లాసానికి దోహపడు తాయని డీఎస్పీ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం
విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఎస్పీ శ్రీనివాస్‌ యాదవ్‌

-నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌

కందనూలు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఆటలు మా నసికోల్లాసానికి దోహపడు తాయని డీఎస్పీ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మండ లంలోని శ్రీపురం గ్రామంలో మంగళవారం శ్రీపురం క్రికె ట్‌ లీగ్‌ పేరుతో క్రికెట్‌ పోటీ లు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ ఆటలు పోటీ కోస మే కాక మానసికోల్లాసానికి ఆడాలని ఆటల్లో గెలుపోటములు సహజమని ఓడిన వారు మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయాలని, అలాగే గెలిచిన వారు ఇంకా మంచిగా రాయడానికి ప్రాక్టీస్‌ చేయాలని ఆటలు, మానసిక ప్రశాం తతను కాపాడాలి కాని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఐ గోవర్ధన్‌, సర్పంచ్‌ గీతారెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటయ్య, చంద్రనా రాయణ, శేఖర్‌, ఓర్సు బంగారయ్య, కిష్టారెడ్డి, గోపాల్‌ పాల్గొన్నారు.

క్రీడాకారుడికి ఆర్థిక సాయం

తిమ్మాజిపేట, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాల ని వాటికి బానిసలు కావద్దని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని ఉమ్మడి పుల్లగిరి గ్రామపంచాయతీ శివారులో బుధవారం యువతకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు మేల్కొనాల ని తమ భవిష్యతు మార్చుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల న్నారు. రెండు రోజులుగా సర్పంచ్‌ ముడావత్‌ నీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొం దిన వారికి బహుమతులను అందజేశారు. అదే విధంగా జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో ప్రతిభ ను కనబర్చి బంగారు గెలుపొందిన కొడావత్‌ తండాకు చెందిన స్వప్నకు కాంగ్రెస్‌ పార్టీ సీని యర్‌ నాయకులు గోవింద్‌నాయక్‌ అందించిన రూ.45వేలను డీఎస్పీ ద్వారా ఆమెకు అందజేశా రు. ఈ సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రాజు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురేష్‌పాల్గొన్నారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఎస్‌ఐ

కోడేరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : యువ త డ్రగ్స్‌, గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిస లు కావద్దని వాటికి దూరంగా ఉండాలని ఎస్‌ఐ వేణుగోపాల్‌ అన్నారు. బుధవారం మంల పరి ధిలోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో భారత ప్రజా తంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో ముద్రిం చిన 2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరిం చారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ని ర్మాణంలో యువతదే కీలకమన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌ వరప్రసాద్‌ మాట్లా డుతూ ఎంతో మంది యువకులను దేఽశ భవి ష్యత్తుపై అవగాహన కల్పించి ఉత్తమ పౌరు లుగా తీర్చిదిద్దడంలో డీవైఎఫ్‌ఐకి సాటి లేదన్నా రు కార్యక్రమంలో జిల్లా డీవైఎఫ్‌ఐ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌, వంశీ, ప్రేమ్‌కుమార్‌, జనుంపల్లి నాయకులు శ్రీకాంత్‌, శివకుమార్‌, రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:59 PM