Share News

kumaram bheem asifabad- ఆశలకు రెక్కలు

ABN , Publish Date - May 28 , 2026 | 10:49 PM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో జాబితాలను ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులను జిల్లా అధికారులు కోరారు. దీంతో గ్రామాల్లో మళ్లీ సందడి నెలకొంది.

kumaram bheem asifabad- ఆశలకు రెక్కలు
లోగో

- నామినేట్‌ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు

- జాబితా పంపాలంటూ ఆదేశాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో జాబితాలను ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులను జిల్లా అధికారులు కోరారు. దీంతో గ్రామాల్లో మళ్లీ సందడి నెలకొంది. పదవి అశిస్తున్న నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లాలో 12 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో పదవులు పొందేందుకు ఆశవహలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

- గడువు పొడిగింపుతో..

పాక్స్‌ పాలకమండళ్లు, డీసీఎంఎస్‌, డీసీసీబీ పాల కవర్గాల గడువు ఫిబ్రవరి 14, 2025న ముగిసింది. దీంతో ప్రభుత్వం వాటి గడువును మరో 8 నెలలు పొడగించింది. అనంతరం మరో ఆరు నెలల గడు వును పొడిగిస్తూ ఆగస్టు 14, 2025న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పొడిగింపు గడువు ఫిబ్ర వరి 14, 2026 వరకు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్‌ ఇన్‌చార్జీల ను నియమిస్తూ డిసెంబరు 19, 2025న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాక్స్‌లకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్‌ విధానంతో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గడువు ఉండగానే పాలక మండళలను రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానా నికి వెళ్లడంపై పలువురు నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని తీర్పు చెప్పింది. కోర్టు సూచన మేరకు ఈనెల 5 నుంచి పాత పాలక మండళ్లను పునరుద్దరించారు. అయితే ఈ పాలక మండళ్ల విషయం తేలాల్సి ఉండగానే నామినేటెడ్‌ విధానంలో ఒక్కో పాక్స్‌కు 11 నుంచి 13 మందితో కూడిన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

18 రకాల వివరాలు..

అధ్యక్షుడు, సభ్యులుగా నియమించేవారికి సంబం ధించి 18 రకాల వివరాలను పంపాలని ప్రభుత్వం సూచించింది. మార్కెట్‌ కమిటీల మాదిరిగానే అధ్యక్షుడు, ఉపాధ్య క్షుడు, సభ్యులు, అధికారులు ఎఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, సెగ్మెంట్‌ బాధ్యులు, జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రుల ద్వారా పాలకమం డళ్ల ప్రతినిధులను ఎన్నిక చేసే అవకాశం ఉంది. అయితే ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోళ్లు, రుణాల పంపిణీ, బ్యాంకింగ్‌ కౌంటర్ల ద్వారా లావాదేవీల నిర్వహణ తదితర వాటితో పాక్స్‌లకు అమితమైన ప్రాధాన్యం ఉంది. దీంతో పాలక మండళ్లకు పోటీ ఎక్కువగానే ఉండనుంది.

Updated Date - May 28 , 2026 | 10:49 PM