kumaram bheem asifabad- ధరలకు రెక్కలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:12 PM
వంటింట్లోని గ్యాస్ ధర అధికారికంగా ప్రభుత్వం పెంచినప్పటికీ అనధికారికంగా కొందరు వ్యాపారులు వంటనూనె లు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచేశారు. మరికొన్నిచోట్ల స్టాక్ లేదంటూ కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ ప్రభావం నిత్యావసర సరుకులకు సంబంధించి ముడి సరుకు దిగుమతులు నిలిచి పోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
- వంట నూనె లీటరుకు రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు
- పప్పులు కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరుగుదల
- ఇప్పటికే పెరిగిన వంట గ్యాస్ ధరలు
- జిల్లాలో సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం
బెజ్జూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వంటింట్లోని గ్యాస్ ధర అధికారికంగా ప్రభుత్వం పెంచినప్పటికీ అనధికారికంగా కొందరు వ్యాపారులు వంటనూనె లు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచేశారు. మరికొన్నిచోట్ల స్టాక్ లేదంటూ కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ ప్రభావం నిత్యావసర సరుకులకు సంబంధించి ముడి సరుకు దిగుమతులు నిలిచి పోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కృత్రిమ కొరత లేకుండా ధరలను నియంత్రించే విధంగా అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- వంటింటిపై ప్రభావం..
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటిం టిపై ప డింది. వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపో యాయి. యుద్ధం కారణంగా దిగుమతులకు ఏర్పడిన ఆటంకాలతో ఆయిల్‌కు సంబంధించిన ముడి సరుకు నిలిచిపో యింది. ఇదే అదునుగా భావించిన కొన్ని ఆయిల్ కంపెనీలు, వ్యాపారులు, హోల్‌సేల్ నిర్వాహకులు ధరలను అమాంతంగా పెంచేశారు. వంటనూనె ధరలను లీటరుకు రూ.20నుంచి రూ.30వరకు పెంచినట్లు మార్కెట్ ధరలు చెబుతున్నాయి. సన్‌ప్లవర్ మొన్నటి వరకు ధర లీటరుకు రూ.145ఉండగా, ప్రస్తుతం మారె ్కట్‌లో రూ.175వరకు ధర పెంచి విక్రయిస్తున్నారు. పల్లినూనె ధర రూ.160ఉండగా, ప్రస్తుతం రూ.175, పామాయిల్ నూనె రూ.125ఉండగా, రూ.135వరకు అమ్ముతున్నారు. యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే వంటనూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వంటనూనెల ధరలు పెరగ గా, యుద్ధం కారణంగా ధరలు ఆకాశన్నంటడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం కనబడుతోంది.
- తీవ్ర ప్రభావం..
యుద్ధ ప్రభావం నిత్యావసర సరుకులపై కూడా తీవ్రంగానే పడుతోంది. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే కమర్షియల్ సిలిండ్లర్లపై 115రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర 985రూపాయలకు, కమర్షియల్ సిలిండర్ ధర 2145రూపాయలకు పెరిగింది. దీంతో వినియోగదారులపై తీరని భారం పడింది. గ్యాస్ ధరల పెంపును సాకుగా తీసుకుని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ధరలను పెంచుతు న్నారు. యుద్ధం కారణంగా ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఇంధన వనరుల సరఫరా నిలిచిపోవడం వల్ల ఇంధన కొరత ఏర్పడుతున్నది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది నిత్యావసర సరుకులైన పప్పుల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. వంటింట్లో పప్పులు ఉడకలేని పరిస్థితి ఎదురవుతోంది. కిలోకు రూ.10నుంచి రూ.20వరకు ధరలు పెంచినట్లు తెలు స్తోంది. కందిపప్పు మూడు రోజుల క్రితం వరకు రూ.125ఉండగా, ప్రస్తుతం రూ.150కి పెరిగింది. మినపప్పు రూ.120ఉండగా, ప్రస్తుతం రూ.140కి చేరింది. కొందరు వ్యాపారులు ఉన్న నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోప ణలున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు విమర్శ లు వస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్‌ధరలను ప్రభుత్వం పెంచడంతో గ్యాస్ ఏజెన్సీటు బుకింగ్‌కు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్, వంటనూనె, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రతీ వస్తువుపై మరింత భారం పడ నుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వాలు ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ధరలను నియంత్రించాలి..
- రాపెల్లి సుస్మిత, గృహిణి
ప్రభుత్వం ధరలు పెరగకుండా నియంత్రించాల్సి న అవసరముంది. ఎక్కడో ఏదో జరిగితే మన దగ్గర నిత్యావసర సరుకులైన పప్పులు, వంట నూనెల ధరలను పెంచుతున్నారు. దీంతో ఏమి కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికే గ్యాస్ ధర రూ.60కి పెంచడంతో భారంగా మారింది. ఇక పప్పులు, వంటనూనెల ధరలు సైతం పెరగడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.