డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:28 PM
కార్పొరేషన్‌లోని 11వ డివి జన్‌లోని శ్రీపాద సిటి, టీఎన్ జీవోస్ కాలనీ, సత్యనారాయణ కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సుధ మల్ల హరిక్రిష్ణ అన్నారు. 11వ డివిజన్‌లో సోమవారం ప్రజా పాలన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
11 డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ
నస్పూర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌లోని 11వ డివి జన్‌లోని శ్రీపాద సిటి, టీఎన్ జీవోస్ కాలనీ, సత్యనారాయణ కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సుధ మల్ల హరిక్రిష్ణ అన్నారు. 11వ డివిజన్‌లో సోమవారం ప్రజా పాలన ప్ర గతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు నాయకత్వంలో కాలనీల సమస్యలు పరిష్కరించి అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, కాలనీ వాసులు, సిబ్బంది పాల్గొన్నారు.