Share News

ఏకరూప దుస్తులు వచ్చేనా?

ABN , Publish Date - May 31 , 2026 | 01:29 AM

ప్రతిఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అందే పరిస్థితి కనిపించడం లేదు. పాఠశాలల ఆరంభం నాటి నుంచే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులతోపాటు రెండు జతల ఏకరూప దుస్తులను అందించాల్సి ఉండగా ఇప్పటివరకు వాటిని ప్రభుత్వం కుట్టించకపోవడంతో పాతదుస్తులే వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి

ఏకరూప దుస్తులు వచ్చేనా?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతిఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అందే పరిస్థితి కనిపించడం లేదు. పాఠశాలల ఆరంభం నాటి నుంచే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులతోపాటు రెండు జతల ఏకరూప దుస్తులను అందించాల్సి ఉండగా ఇప్పటివరకు వాటిని ప్రభుత్వం కుట్టించకపోవడంతో పాతదుస్తులే వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గాను కేంద్రరాష్ట్రప్రభుత్వాలు 20ఏళ్లుగా ఉచిత సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నాయి. మధ్యాహ్నభోజన పథకం అమలు చేయడంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్త్తకాలు, నోటుబుక్కు లను అందిస్త్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు ఒక్కో విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులను ఇవ్వాలని అందిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వీటితోపాటు 21రకాల వస్తువుల కిట్‌ను కూడా అందించాలని నిర్ణయించారు. జూన్‌15వ తేదీకల్లా ఈ కిట్లను అన్ని పాఠశాలలకు చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఈకిట్లతో పాటే ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్‌ మాసాల్లోనే ఆయాపాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం దుస్తులు కుట్టించేందుకు బల్క్‌గా క్లాత్‌ కొనుగోలుచేసి జిల్లాలకు సరఫరా చేస్తుంటుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన దుస్తులను ఒకేడిజైన్లలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో గల ప్రభుత్వపాఠశాలల్లో 31804మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 15,085మంది, బాలికలు 16,719మంది ఉన్నారు. వీరందరికీ రెండుజతల ఏకరూప దుస్తుల కోసం జిల్లావిద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

ఫ మహిళా సంఘాలకు కరువైన ఉపాధి..

ప్రభుత్వం ఏకరూప దుస్తులు పంపిణీ చేసేందుకు గాను క్లాత్‌ సరఫరా చేయకపోవడంతో మహిళాసంఘాల సభ్యులకు ఉపాధి కరువయ్యింది. కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నది. ఐదేళ్లలో వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు గాను స్వయం ఉపాధి పథకాలపై దృష్టిసారించింది. ఆ మేరకు పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీబస్సులు పెట్టేందుకు రుణాలు ఇస్తుండగా, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగ ణాల్లో మహిళలచే క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ అందించారు. ప్రభుత్వ పాఠశాలలు, వివిధ సంక్షేమ శాఖల వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్త్తులను కుట్టించే బాధ్యతను మహిళాసంఘాలకు అప్పగించారు. ఒక్కోడ్రెస్‌కు 75రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లాత్‌ సరఫరా చేయక పోవడంతో మహిళాసంఘాల సభ్యులు ఎప్పుడు ఇస్తారా, అని ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో క్లాత్‌ సరఫరా చేయగా, మే నెలాఖరుకల్లా దుస్తులు కుట్టించి పాఠశాలలకు సరఫరా చేశారు. జూన్‌12వ తేదీన పాఠశాలలో ప్రారంభంరోజు నుంచే విద్యార్థు లకు దుస్త్తులను అందజేశారు. ఈసారి ఇప్పటివరకు ప్రభుత్వం క్లాత్‌సరఫరా చేయక పోవ డంతో ఆలస్యం కానున్నది.

Updated Date - May 31 , 2026 | 01:29 AM