kumaram bheem asifabad- యూనిఫాం అందేనా..?
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:18 PM
పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు రెండేసి యూని ఫాం జత అందించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు యూనిఫాం కుట్టేందేకు వస్త్రం చేర లేదు. దీంతో పాఠశాలలకు పాత దుస్తులతోనే రావల్సిన పరిస్థితి నెలకొన్నది.
- జిల్లాకు ఇంకా చేరని ముడివస్త్రం
ఎంఆర్సీ కేంద్రాలకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్
పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు రెండేసి యూని ఫాం జత అందించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు యూనిఫాం కుట్టేందేకు వస్త్రం చేర లేదు. దీంతో పాఠశాలలకు పాత దుస్తులతోనే రావల్సిన పరిస్థితి నెలకొన్నది.
బెజ్జూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థుల కు ఈ ఏడాది కొత్త పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ జిల్లాలోని ఆయా మండ లాలకు చేరాయి. మండల కేంద్రాల నుంచి పాఠ్యపుస్తకాలను ఆయా మండల విద్యాధికారులు ఆధ్వర్యంలో పాఠశాలలకు పంపిణీ చేపడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 833, ప్రాథమికోన్నత పాఠ శాలలు 106, ఉన్నత పాఠశాలలు 103ఉన్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయానికి చర్యలు తీసుకుంది. ఈ నెల 15నుంచి పాఠశాలలు ప్రారంభమవుతుండగా, అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు.
- సిద్ధం కాని యూనిఫామ్స్..
పాఠశాలలు ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నా యూనిఫామ్స్ కుట్టేందుకు అత్యంత కీలకమైన వస్త్రమే జిల్లాకు సరఫరా కాలే దు. దీంతో పాఠశాలల ప్రాంభానికి విద్యార్థులకు కొ త్త దుస్తులు అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో గ త ఏడాది 62,315మంది విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయగా, ఈ ఏడాది ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాఽశాఖ భావిస్తోంది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూని.ఫామ్స్ అందించాల్సి ఉంది. జిల్లాకు అవస రమైన వస్త్రంకు సంబంధించిన ఇండెంట్‌ను పెట్టా రు. అయితే వస్త్రం సరఫరాలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా టెండర్లు ఖరారు కాకపో వడంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు అవసరమైన వస్త్రం సరఫరా కాలేదు. గతంలో విద్యాశాఖ అధికా రులు మహిళా సంఘాలతో యూనిఫామ్స్ కుట్టేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక డ్రెస్‌కు రూ.75కుట్టు కూలీగా నిర్ణయించారు. మార్చిలోనే పాఠశాలల్లో విద్యార్థుల కొలతలను సైతం సేకరిం చారు. వస్త్రం సరఫరా కాకపోవడంతో యూనిఫామ్స్ కుట్టు పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభం నాటికి పాత దుస్తులతోనే హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
- కిట్ల పంపిణీపై..
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్లు ఇస్తామని గతంలో ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 21రకాల వస్తువులతో కూడిన కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో కిట్లు ఉన్నట్టా లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21రకాల వస్తువుల్లో షూస్, సాక్స్, స్కూల్ బ్యాగు, టై, బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్స్, షార్పనర్స్, జామెట్రీ బాక్సు, డిక్షనరీ తదితర వస్తువులు ఉంటాయని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. కానీ కిట్ కారణంగానే దుస్తులు ఇవ్వడంలో వాయిదా వేస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. వీటి పంపిణీపై ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల మాత్రం చేయలేదు. దీంతో విద్యాశాఖ అధి కారుల్లోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యా ర్థులకు ఏది ఇవ్వాలి.. ఏది ఇవ్వకూడదు అనే విష యంపై ఇప్పటివరకు స్పష్టత లేదని చెబుతున్నారు.