Share News

శ్రావణపల్లి బొగ్గుగనికి మోక్షం కలిగేనా?

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:46 PM

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. కేంద్రప్రభుత్వం తాడి చర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో శ్రా వణపల్లి గనిపై ఆశలు చిగురిస్తున్నాయి.

శ్రావణపల్లి బొగ్గుగనికి మోక్షం కలిగేనా?

-అండర్‌గ్రౌండ్‌ మైన్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం

-తాడిచర్ల-2 బ్లాక్‌ కేటాయింపుతో చిగురిస్తున్న ఆశలు

-గనులు మూతపడుతున్న నేపథ్యంలో మళ్లీ తెరపైకి

-బలం చేకూరుస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

మంచిర్యాల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. కేంద్రప్రభుత్వం తాడి చర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో శ్రా వణపల్లి గనిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మంచిర్యాలలో పర్యటిం చిన సందర్భంగా బొగ్గు గనులపై మాట్లాడుతూ తా డిచర్ల బ్లాక్‌ మాదిరిగానే మరో గని గురించి త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్తానన్న వ్యాఖ్యలు శ్రావణపల్లి గని ఏ ర్పాటుపై బలం చేకూరుస్తున్నాయి. స్వయంగా కేంద్ర మంత్రి కొత్తగని గురించి ప్రస్తావించడంతో జోరుగా చర్చ జరుగుతోంది. శ్రావణపల్లిలో బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు మూడుదశాబ్దాల నుంచే సింగరేణి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కోట్ల రూ పాయలు వెచ్చించి అనేకమార్లు సర్వేలు సైతం చేసిం ది. సంస్థకు చెందిన అన్వేషణ విభాగం అధికారులు 1996లో డ్రిల్లింగ్‌ పనులు కూడా చేపట్టారు. భూ సే కరణ కోసం సంస్థ ప్రభుత్వానికి నివేదికలు కూడా అం దజేసింది. శ్రావణపల్లి పరిసర ప్రాంతాల్లో 11సీముల్లో 119.9మిలియన్‌ టన్నుల జీ గ్రేడు బొగ్గు నిక్షేపాలు ఉ న్నట్లు అధికారులు గుర్తించారు. గని జీవితకాలం దా దాపు 40 ఏళ్లుగా నిర్ణయించారు. అపారంగా ఉన్న బొ గ్గు నిల్వలను వెలికి తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,936హెక్టార్ల భూమి సేకరించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు.

ప్రజల వ్యతిరేకతతో నిలిచిన పనులు..

సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గని ఏర్పాటు చేస్తే పసిడి పంటలు పండించి పదిమందికి ఉపాధి కల్పించిన తాము.. రాబోయే రోజుల్లో ఇతరుల వద్ద పనిచేయా ల్సిన పరిస్థితి వస్తుందోమోనని భయపడ్డ గ్రామ రైతు లు, ప్రజలు దాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డా రు. శ్రావణపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు బొగ్గు తవ్వకా లతో 350గిరిజన కుటుంబాలు ఉన్న శ్రావణపల్లి ముం పునకు గురవుతుండగా జెండావెంకటాపూర్‌, నార్వాయి పేట, జోగాపూర్‌, మందమర్రి మండలంలోని మామి డిగట్టు, సారంగపలల్లి గ్రామాలపై తీవ్ర ప్రభావం పడ నుంది. ఆయాగ్రామాల పరిధిలో సుమారు 14వేల ఎక రాల మామిడితోటలు, ఆరువేల ఎకరాల వరిపొలాలు ఓసీపీ వల్ల కనుమరు గవుతాయి. అలాగే సుమారు 500ఎకరాల ఆయకట్టుకు నీరందించే చెరువులు, కుం టలు కూడా ఓసీపీ వల్ల కాలగర్భంలో కలిసే అవకా శాలు ఉండటంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అ ప్పట్లో పీపుల్స్‌వార్‌ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమైఖ్య(సికాస) సైతం శ్రావణపల్లి ఓపెన్‌ కాస్టు నిర్మా ణ ప్రక్రియను అడ్డుకుంది. 1996జులై 5న శ్రావణ పల్లి లో ఎక్స్‌టెన్షన్‌ బ్లాక్‌ పనులు చేపడుతున్న ఎక్స్‌ ప్లోరే షన్‌ డిపార్టుమెంటుకు చెందిన రూ.60లక్షల విలువ గ ల నాలుగు రిగ్గులను నక్సలైట్లు దగ్ధం చేశారు. కాల క్రమేణ సికాస ప్రాభల్యం తగ్గడంతో మళ్లీ సింగరేణి తన ప్రయత్నాలు ప్రారంభించింది. 2005లో గ్రామా నికి వచ్చిన సింగరేణి అధికారులపై ప్రజలు దాడిచేశా రు. మరోసారి సర్వేకు వచ్చిన రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అఽధికారులను దినమంతా గృహనిర్బంధంలో ఉంచారు. అప్పటి మానవ హక్కుల వేదిక ప్రధానకార్యదర్శి బా లగోపాల్‌, అధ్యక్షులు బుర్రా రాములు, జర్నలిస్టు ఫో రం అధ్యక్షులు పాశం యాదగిరి లాంటి ప్రముఖులు ఇక్కడికి వచ్చి బొగ్గుగనుల ఏర్పాటుకు వ్యతిరేకంగా స దస్సులు నిర్వహించారు. దీంతో అధికారులు వెను కడుగు వేశారు.

వేలం ప్రకటనతో తెరపైకి..

శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్రప్రభుత్వం వే లానికి పెట్టడంతో గని ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చిం ది. గోదావరి లోయలోని శ్రావణపల్లి బ్లాకును దక్కిం చుకునేందుకు పలు కార్పొరేట్‌ సంస్థలు పోటీపడగా, కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆ ప్రాంతంలో బొగ్గు ని క్షేపాలను కనుగొన్న తమకే ఆ బ్లాక్‌ను కేటాయించాలని సింగరేణి పట్టుబడుతోంది. శ్రావణపల్లి చేజారితే భ విష్యత్తులో బొగ్గు ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలిగి సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావించి, గనిని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈక్ర మంలో నేరుగా కేటాయించడం కుదరదని, వేలంలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడి కైవసం చేసుకోవాలని సింగరేణికి కేంద్రప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం, మరో గని విషయమై కిషన్‌రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్తాననడంతో ఆ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రావ ణపల్లిలో ఓపెన్‌కాస్టు గని ఏర్పాటు చేసిన పక్షంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నందున అండర్‌గ్రౌండ్‌ మైన్‌ ఏ ర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నిర్ణయానికి ప్రజలు కూడా సంసిద్దత తెలిపే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. సింగరేణి వ్యా ప్తంగా పెద్దమొత్తంలో గనులు మూతపడుతున్న నే పథ్యంలో శ్రావణపల్లిలో అండర్‌గ్రౌండ్‌ మైన్‌ ఏర్పాటు చేస్తే సుమారు మూడువేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 16 , 2026 | 11:46 PM