Share News

సర్వీస్‌ రోడ్డు నిర్మాణం జరిగేనా...?

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:58 PM

సింగరేణి అధికారుల నిర్వాకం రైతులకు శాపంగా మారింది. సర్వీసు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు గడి చి నా.... ఆ ఊసే ఎత్తకపోవడంతో భూములు సాగు చే సేందుకు అవకాశం లేకుండా పోయింది.

సర్వీస్‌ రోడ్డు నిర్మాణం జరిగేనా...?

-రైతులకు ఇచ్చిన హామీ మరిచిన సింగరేణి

-ఐకే ఓసీపీ కోసం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం

-ఐదేళ్లుగా భూముల సాగుకు నోచుకోని రైతులు

-అధికారుల నిర్లక్ష్యంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థులు

-కలెక్టర్‌ కోర్టుకు చేరిన పంచాయతీ

మంచిర్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణి అధికారుల నిర్వాకం రైతులకు శాపంగా మారింది. సర్వీసు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు గడి చి నా.... ఆ ఊసే ఎత్తకపోవడంతో భూములు సాగు చే సేందుకు అవకాశం లేకుండా పోయింది. అప్పటి నుం చి సింగరేణి, రెవెన్యూ అధికారుల కార్యాలయాల చు ట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో హై కోర్టు ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. హై కోర్టు ఆదేశాలతో సింగరేణి, రెవెన్యూ అధికారుల్లో ఎట్టకేలకు చలనం రాగా, కలెక్టర్‌ కోర్టులో ఈ నెల 20 వ తేదీన తుది విచారణ చేపట్టనున్నారు.

మంచిర్యాల నుంచి గోదావరి ఖని వైపు వెళ్లే రాజీవ్‌ రహదారిపై జైపూర్‌ మండలం ఇందారం వద్ద 2000 సంవత్సరంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందారం ఓపె న్‌కాస్టు గని (ఐకే ఓసీపీ)లో వెలువడ్డ మట్టి డంప్‌ కోసం సంస్థ అధికారుల విన్నపం మేరకు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. బ్రిడ్జి కింద నిర్మించిన అండ ర్‌ పాస్‌ నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్‌ లారీలు ఓసీపీ మట్టిని తరలిస్తున్నాయి. బ్రిడ్జిని ఆను కొనిఇరువైపులా ఇందారం, రామారావుపేట గ్రామాల కు చెందిన సుమారు 150 మంది రైతులకు చెందిన ఐదారు వందల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి పూర్వం రహదారి పైనుం చి టీ-జంక్షన్‌ వద్ద రైతులు అవతలి వైపు ఉన్న తమ పొలాలకు రాకపోకలు సాగించేవారు. బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. బ్రిడ్జి ఎత్తులో ఉండటం, దాని కింద నిర్మించిన అండర్‌ పాస్‌ నుంచి ఓసీపీకి చెందిన లారీల రాకపోకలు సాగిస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఐదేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటను తరలించేం దుకు సమీపంలోని రైతులు ఇతరుల పట్టా భూము లపై ఆధారపడుతున్నారు. సంబంధిత యజమానులు అభ్యంతరం తెలపడంతో పంటను తరలించే మార్గం లేకుండా పోయింది.

హామీ విస్మరించిన సింగరేణి అధికారులు....

రాజీవ్‌ రహదారిపై ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ సమ యంలో ఇందారం, రామారావుపేట గ్రామాల రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడతా యని పనులను అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో సింగరేణి అప్పటి అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా స ర్వీస్‌ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే బ్రిడ్జి నిర్మాణం జరిగి ఆరేళ్లు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో సింగరేణి అధికారులు పూ ర్తిగా విఫలమయ్యారు. రైతుల డిమాండ్‌ మేరకు బ్రిడ్జి వెంట దాదాపు 400 మీటర్ల పొడవుతో 30 అడుగుల వెడల్పుతో సర్వీస్‌ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందు కో సం 38 గుంటల భూమి సేకరించాలని సింగరేణి అధి కారులు నిర్ణయించారు. కాలక్రమంలో సింగరేణి అధి కారుల బదిలీలు జరగడం, కొత్తగా వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో ఈ విషయం మరుగన పడింది.

కోర్టు ఆదేశాలతో కదలిక...

సర్వీస్‌ రోడ్డు నిర్మాణం కోసం రెండు గ్రామాల రైతులు అనేకమార్లు సింగరేణి, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండేళ్ల క్రితం హై కోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్‌పై విచా రణ జరిపిన హై కోర్టు పరిష్కారం చూపాలని సింగ రేణి అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఈ నెల 11న రైతులను తన కార్యాల యంలో విచారించారు. రైతుల గోడు విన్న కలెక్టర్‌ పూ ర్తి సమాచారం, ఆధారాలతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని సింగరేణి, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అ ధికారులను ఆదేశించినట్లు రైతులు తెలిపారు. ఇప్పటి కైనా అధికారులు సర్వీస్‌ రోడ్డు నిర్మించడం ద్వారా త మ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

సర్వీస్‌ రోడ్డు నిర్మించాలి....

జిట్ట శ్రీహరి, రామారావుపేట రైతు

గతంలో ఇందారం వద్ద ఉన్న నేషనల్‌ హైవే పై టీ -జంక్షన్‌ ఉండేది. అక్కడి నుంచి నేరుగా మా పంట పొలాలకు వెళ్లేందుకు దారి ఉండేది. ఓసీపీ ఫ్లై ఓవర్‌ నిర్మించిన తరువాత ఆ అవకాశం లేకుండా పోయింది. పొలాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. సింగరేణి అధికారులు సర్వీస్‌ రోడ్డు నిర్మిస్తా మని చెప్పి, నిర్లక్ష్యం చేయడంతోనే మాకు ఈ దుస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో హై కోర్టును ఆశ్ర యించాల్సి వచ్చింది.

Updated Date - Aug 16 , 2026 | 10:58 PM