Share News

విద్యాహక్కు చట్టం అమలయ్యేనా..?

ABN , Publish Date - May 27 , 2026 | 11:32 PM

రాష్ట్రంలో విద్యాహక్కు చ ట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థు లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టిక ల్‌ 21ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చే యాల్సి ఉంది.

విద్యాహక్కు చట్టం అమలయ్యేనా..?

-2009 చట్టానికి ఆదిలోనే పాతర

-ఉచిత విద్యకు నోచుకోని పేద విద్యార్థులు

-ప్రైవేటు బడుల్లో అమలుగాని 25 శాతం రిజర్వేషన్‌

-అమలుకాని హై కోర్టు ఆదేశాలు

మంచిర్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాహక్కు చ ట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థు లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టిక ల్‌ 21ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చే యాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లలకు ఎలిమెంటరీ ఎడ్యుకే షన్‌ (1 నుంచి 8 తరగతులు)ను ఉచితంగా అభ్యసించే హక్కు ను కల్పించింది. ఏదేని కారణం చేత ఎలిమెంటరీ విద్యను అభ్య సించని యెడల ఎలాంటి ప్రాథమిక విద్య చదవాల్సిన అవసరం లేకుండానే విద్యార్థి నేరుగా తన వయస్సుకు సరిపడా తరగతిలో చేరే అవకాశాన్ని కూడా ఆర్టికల్‌ 21ఏ కల్పించింది.

ఆదిలోనే చట్టం నిర్వీర్యం...

ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేసేందుకు గాను 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం -2009ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యా ర్థులకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సి ఉం ది. అయితే తెలంగాణలో ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడం తోపాటు ఆదిలోనే చట్టం నిర్వీర్యం అయింది. ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్‌ సహా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమూ చట్టాన్ని విస్మరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలోనూ అది అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌, ప్రత్యేక పాఠ శాలలు 25 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం అనాఽథలు, అంగవైకల్యంగల పిల్లలు, హెచ్‌ఐవీ సోకిన పిల్లలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యలో 5 శాతం ఉచిత వి ద్యను అందించాల్సి ఉండగా, షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ)కు 10 శా తం, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు 4 శాతం, బలహీన వర్గాలు (బీసీ), మైనారిటీలకు- 6 శాతం ఉచితంగా విద్యను బోధించాల్సి ఉంది.

ఉచిత విద్యకు ప్రైవేటు విద్యాసంస్థల వెనుకంజ....

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అర్హతలు గల విద్యార్థు లకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యాసంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. బడ్జెట్‌ పాఠ శాలలను మినహాయిస్తే దనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కార్పొరేట్‌, ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు చట్టాన్ని తుంగలో తొక్క డమేగాకుండా, ప్రశ్నించిన వారికి అడ్మిషన్లు కూడా ఇవ్వకుండా వే ధిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో 200 వరకు ప్రభు త్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉండగా, పదుల సం ఖ్యలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు పని చేస్తున్నాయి. అన్ని ప్రైవేటు విద్యాలయాల్లో కలిపి దాదాపు 60వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఎక్కడ కూడా విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదు. ప్రశ్నించే వారు లేక విద్యా సంస్థల నిర్వాహకులు వేలకు వేలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నా రు. విద్యార్థుల పక్షాన పోరాడాల్సిన విద్యార్థి సంఘాల నాయకులు కూడా విద్యాహక్కు చట్టంపై యాజమాన్యాలను ప్రశ్నించకపోవ డం గమనార్హం. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ విషయమై ధృష్టి సారించకపోవడంతో చట్టం నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా మరో 15 రోజుల్లో వేసవి సెలవులు ముగిసి, పా ఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం ఈ విద్యా సంవత్సరం నుంచైనా విద్యాహక్కు చట్టం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు మేలు చేకూర్చినట్లు అవుతుంది.

కోర్టు ఆదేశాలూ బేఖాతర్‌...?

పేదలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ల కల్ప నపై హామీ ఇవ్వాలన్న హై కోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం ఖాతరు చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వి ద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం అమలుకోసం జారీ చేసిన మెమోను నిజమైన స్పూర్తితో అమలు చేస్తామని కోర్టు అం డర్‌ టేకింగ్‌ కూడా కోరింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యాహ క్కు చట్టాన్ని అమలు చేయడం లేదంటూ 2020లో హైకోర్టులో ప లు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇదే విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కూడా రెండుసార్లు విచారణ చేపట్టింది. అయినప్పటికీ విద్యాహక్కు చట్టం అమలు కాకపోవడం ప్రత్యేక విభాగాల విద్యార్థులకు శాపంగా మారింది.

Updated Date - May 27 , 2026 | 11:33 PM